ఆర్టీసీలో కారుణ్య నియామకాలకు గ్రీన్ సిగ్నల్.. ఏ జిల్లాలో ఎన్ని పోస్టులంటే.?

ఆర్టీసీలో కారుణ్య నియామకాలకు గ్రీన్ సిగ్నల్.. ఏ జిల్లాలో ఎన్ని పోస్టులంటే.?

టీఎస్ఆర్టీసీలో కారుణ్య నియామకాలపై మంత్రి పొన్నం ప్రభాకర్ గుడ్ న్యూస్ చెప్పారు.  కారుణ్య నియామకాల కింద 813 మందిని కండక్టర్లుగా తీసుకోవడానికి సిద్దమని తెలిపారు. ఈ మేరకు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.   పదేళ్లుగా   కారుణ్య నియామకాల కోసం ఎదురు చూస్తు తీవ్ర ఇబ్బందులు పడుతున్న కుటుంబాలకు న్యాయం జరిగిందన్నారు.  తమ ప్రభుత్వం వారి సంక్షేమానికి కట్టుబడి ఉందని  పొన్నం ప్రభాకర్ వెల్లడించారు.. 

హైద‌రాబాద్ (66), సికింద్రాబాద్ (126). రంగారెడ్డి (52), న‌ల్గొండ (56), మ‌హ‌బూబ్‌న‌గ‌ర్ (83), మెద‌క్ (93), వ‌రంగ‌ల్ (99), ఖ‌మ్మం (53), అదిలాబాద్ (71), నిజామాబాద్ (69), క‌రీంన‌గ‌ర్ (45) రీజియ‌న్ల నుంచి మొత్తం 813 కండ‌క్టర్ పోస్టుల‌ను  సంస్థ భర్తీ చేయ‌నుంది.

కారుణ్య నియామ‌కాలు, మెడికల్ ఇన్‌వాలిడేషన్ స్కీమ్ కింద ఉద్యోగుల జీవిత భాగస్వామి/పిల్లలకు ప్రత్యామ్నాయ ఉపాధిని అందించడానికి వారి విద్యార్హత ప్రకారం  ఉద్యోగాలు కల్పిస్తున్న విష‌యం తెలిసిందే. సర్వీసులో ఉండగా మరణించిన  సంస్థ సిబ్బంది కుటుంబాలకు ఇదొక ఊరట అని చెప్పుకోవ‌చ్చు.