
కులగణనపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అవగాహన రాహిత్యంతో మాట్లాడుతున్నారని ఫైర్ అయ్యారు మంత్రి పొన్నం ప్రభాకర్. తెలంగాణలో తాము చేసింది జనాభా లెక్కలు చేయలేదని .. కులగణన చేశామని అన్నారు. కిషన్ రెడ్డికి ఈ విషయం తెలీక విమర్శలు చేస్తున్నారని విమర్శించారు. జనాభా లెక్కలు చేసే అధికారం కేంద్ర ప్రభుత్వానికి .. కులాల లెక్కలు తేల్చే అధికారం రాష్ట్రానికి ఉందన్నారు.దేశానికి రోల్ మోడల్ గా తెలంగాణ కుల గణన సర్వే చేసింది.. రాహుల్ డిమాండ్ మేరకే కేంద్రం కులగణన చేస్తామని చెప్పడం కాంగ్రెస్ విజయమని అన్నారు. బీసీ వ్యక్తిని తీసేసి కిషన్ రెడ్డి బీజేపీ అధ్యక్షుడెందుకు అయ్యారో ముందు సమాధానం చెప్పాలన్నారు పొన్నం.
సామాజిక పరంగా రాబోయే కాలంలో తెలంగాణ ప్రజాపాలన ప్రభుత్వంలో అందరికీ న్యాయం చేయడానికి సమగ్ర ప్రణాళికతో ముందుకు పోతున్నారు పొన్నం. జస్టిస్ సుదర్శన్ రెడ్డి,కంచే ఐలయ్యలతో కలిసి కమిటీ వేశామని చెప్పారు.