హుసేన్ సాగర్ లో నిమజ్జనంపై కోర్టు ఆదేశాల ప్రకారం ముందుకెళ్తాం: పొన్నం

 హుసేన్ సాగర్ లో నిమజ్జనంపై  కోర్టు ఆదేశాల ప్రకారం ముందుకెళ్తాం: పొన్నం

హైదరాబాద్ ఇమేజ్ ను మరింత పెంచేలా చూస్తామన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. గణేష్  ఉత్సవాల నిర్వహణపై  బంజారాహిల్స్ లోని కమాండ్ కంట్రోల్ రివ్యూ చేశారు.  మరో వారం రోజుల్లో ప్రజాప్రతినిధులు, గణేష్ ఉత్సవ సమితితో  కూడా మీటింగ్ ఏర్పాటు చేస్తామన్నారు .  ఈ రోజు ఇంటర్నల్ డిపార్ట్మెంటల్ కోఆర్డినేషన్ మీటింగ్ ఏర్పాటు చేశామని చెప్పారు పొన్నం.  గతంలో జరిగిన చిన్న చిన్న లోటుపాట్లు ఈ ఏడాది జరగకుండా చర్యలు తీసుకుంటామన్నారు పొన్నం.  

దేశంలో ముంబై తరువాత హైదరాబాద్ లో గణేష్ ఉత్సవాలు గ్రాండ్ గా జరుగుతాయని చెప్పారు. ఎలాంటి ఇబ్బందులూ లేకుండా బోనాలు ఎలా నిర్వహించుకున్నామో.. అలాగే గణేష్ నిమజ్జనం కూడా జరిగేలా చూస్తామన్నారు.  ప్రజలందరినీ భాగస్వామ్యం చేసి, ఘనంగా నిర్వహించాలన్నారు పొన్నం.

హుసేన్ సాగర్ లో  నిమజ్జనం అంశం కోర్టు ఆదేశాలు ప్రకారం ముందుకు పోతామన్నారు పొన్నం.  గణేష్ మండపం నిర్వాహకులు  పోలీసులకు ఇన్ఫార్మ్ చేయాలని.. అందరూ ఆన్లైన్ లో అప్లై చేసుకోవాలని సూచించారు.  తద్వారా ఎన్ని విగ్రహాలున్నాయి .. వారికి  వెహికిల్స్ ఎలా అరేంజ్ చేయాలో ఒక క్లారిటీ వస్తుందన్నారు