సిద్దిపేట సబ్ స్టేషన్లో అగ్నిప్రమాదం.. ఘటనా స్థలాన్ని పరిశీలించిన పొన్నం

సిద్దిపేట సబ్ స్టేషన్లో అగ్నిప్రమాదం.. ఘటనా స్థలాన్ని పరిశీలించిన పొన్నం

సిద్దిపేట జిల్లా కేంద్రంలోని 220/132 కెవి సబ్ స్టేషన్ లో బుధవారం రాత్రి అగ్ని ప్రమాదం జరిగింది. భారీగా మంటలు ఎగసిపడ్డాయి. పట్టణంతో పాటు ,పలు గ్రామాల్లో కరెంట్ సరఫరా నిలిచిపోయింది. అగ్ని మాపక సిబ్బంది మంటలను ఆర్పారు. మంటలు పక్కనున్న ట్రాన్స్ ఫార్మర్లకు కూడా వ్యాపించడంతో అదుపులోకి తెచ్చేందుకు ఫైర్ సిబ్బంది శ్రమించారు.   విషయం తెలుసుకున్న మాజీ మంత్రి హరీశ్ రావు, దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి ఘటనా స్థలానికి చేరుకున్నారు. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రితో ఫోన్లో మాట్లాడి  వెంటనే తగు చర్యలు తీసుకోవాలని కోరారు.

ఇవాళ గురువారం ఉదయం ఘటనా స్థలాన్నిపరిశీలించారు మంత్రి పొన్నం ప్రభాకర్. దురదృష్టవశాత్తు పెద్ద ప్రమాదం జరిగిందన్నారు. మూడు రోజుల వరకు కరెంట్ రాదనుకున్నాం ..కానీ వెంటనే మరమ్మతులు చేపట్టి విద్యుత్ ఇచ్చామన్నారు. అగ్నిప్రమాదంపై అన్ని కోణాల్లో విచారణ చేస్తున్నామని చెప్పారు.  రైతులకు ఇబ్బందిలేకుండా వ్యవసాయానికి ఉదయం నుంచి కరెంట్ ఇస్తున్నామని తెలిపారు.