దోస్త్ అడ్మిషన్ల విధానాన్ని రద్దు చేయాలి

దోస్త్ అడ్మిషన్ల విధానాన్ని రద్దు చేయాలి
  • మంత్రి పొన్నం ప్రభాకర్​కు ప్రైవేటు డిగ్రీ కాలేజీల వినతి 

హైదరాబాద్, వెలుగు : రాష్ట్రంలో డిగ్రీ కాలేజీల్లో అడ్మిషన్ల కోసం చేపట్టిన దోస్త్ విధానాన్ని పూర్తిగా రద్దు చేయాలని ప్రైవేటు డిగ్రీ, పీజీ కాలేజీల మేనేజ్ మెంట్స్ అసోసి యేషన్ ప్రభుత్వాన్ని కోరింది. ఇంటర్మీడియె ట్ తరహాలోనే కాలేజీ మేనేజ్ మెంట్లు సొం తంగా అడ్మిషన్లు చేసుకునేలా అవకాశం కల్పించాలని విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు సోమవారం హైదరాబాద్​లో మంత్రి పొన్నం ప్రభాకర్​కు సంఘం రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు సూర్యనారాయణరెడ్డి, రామకృష్ణ, వర్కింగ్ ప్రెసిడెంట్లు పరమేశ్వర్, శ్రీధర్ రావు తదితరులతో కూడిన బృందం కలిసి వినతిపత్రం అందించింది.

బీఆర్ఎస్ సర్కారు హయాంలో సగానికి పైగా డిగ్రీ, పీజీ కాలేజీలు మూతపడ్డాయని తెలిపారు. కార్పొరేట్ కాలేజీలకు,  ప్రైవేటు వర్సిటీలకు  వత్తాసు పలికి, బడ్జెట్ కాలేజీలను విస్మరిం చారని ఆరోపించారు. కొత్త ప్రభుత్వమైనా పెండింగ్​లో ఉన్న ఫీజు రీయింబర్స్​మెంట్​ను రిలీజ్​ చేయాలని విజ్ఞప్తి చేశారు.