చిన్నారుల చక్కటి జీవితానికి రెండు చుక్కలు

చిన్నారుల చక్కటి జీవితానికి రెండు చుక్కలు

పోలియో రహిత సమాజం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు మంత్రి సబితా ఇంద్రారెడ్డి. కందుకూరు పిహెచ్ సీలో చిన్నారులకు పోలియో చుక్కలు వేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి  మాట్లాడుతూ..కందుకూరు పిహెచ్ సి పరిధిలో 3861 మంది పిల్లలకు 22 బూత్ ల ద్వారా పోలియో చుక్కలు వేయనున్నట్లు తెలిపారు. పోలియో బూత్ ల వద్ద అన్ని రకాల కోవిడ్ జాగ్రత్తలు పాటించాలని మంత్రి వైద్యాధికారులకు సూచించారు. 5 సంవత్సరాల లోపు పిల్లలందరికి పోలియో చుక్కలు వేయించాలన్నారు. చిన్నారులకు రెండు చుక్కలతో ఆరోగ్యానికి భరోసా  ఇవ్వాలన్నారు. చిన్నారుల జీవితాల్లో వెలుగులు నింపటానికి, పోలియో భారీ నుండి వారిని కాపాడటానికి ప్రతి ఒక్కరు ఆరోగ్య శాఖ వారికి సహకరించాలన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 0-5 సంవత్సరాల వయస్సు గల 38,లక్షల 31 వేల,907 మందిని గుర్తించినట్లు, జిల్లా వ్యాప్తంగా 3 లక్షల 74 వేల 480 మంది చిన్నారులకు 1551 బూత్ లలో పోలియో చుక్కలు వేయనున్నట్లు చెప్పారు. మూడు రోజుల పాటు 54 మొబైల్ టీంల ద్వారా చిన్నారులకు చుక్కల మందు వేయనున్నట్లు తెలిపారు.

ఎర్రకోటపై జెండాకు అవమానం జరగడం బాధాకరం