విద్యార్థులు మార్నింగ్ ఓకే అని..ఇప్పుడు ఆందోళన చేయడమేంటీ.?: సబిత

విద్యార్థులు మార్నింగ్ ఓకే అని..ఇప్పుడు ఆందోళన చేయడమేంటీ.?: సబిత

నిజాం కాలేజ్ విద్యార్థుల ఆందోళనపై  విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి స్పందించారు. విద్యార్థులు ఉదయం 50శాతం హాస్టల్కు అంగీకరించి.. ఇప్పుడు మళ్లీ ఆందోళన చేయడం కరెక్ట్ కాదన్నారు.  విద్యార్థులు రాతపూర్వక హామీ కావాలన్నారని..అందుకే  అధికారిక ఉత్తర్వులు ఇచ్చామని స్పష్టం చేశారు. గతంలో ఎన్నడూ లేని విధంగా యూజీ విద్యార్థులకు హాస్టల్ సదుపాయం కల్పిస్తున్నామన్నారు. సాధ్యాసాధ్యాలు పరిశీలించి 100శాతం హాస్టల్ కల్పించేందుకు నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. విద్యార్థులు ఆందోళన విరమించి క్లాసులకు అటెండ్ కావాలని మంత్రి విజ్ఞప్తి చేశారు. 

నిజాం కాలేజ్ హాస్టల్ వివాదం ఇప్పట్లో కొలిక్కి వచ్చేలా కనిపించడంలేదు. కొత్త హాస్టల్ నిర్మాణం, ప్రస్తుతం ఉన్న గర్ల్స్ హాస్టల్ లో యూజీ స్టూడెంట్స్ కు 50శాతం వసతి కల్పించేందుకు ప్రభుత్వం ముందుకొచ్చినా విద్యార్థినులు మాత్రం అందుకు అంగీకరించడం లేదు. హాస్టల్ ను 100శాతం తమకే కేటాయించే వరకు పోరాటం కొనసాగిస్తామని తేల్చి చెబుతున్నారు.