బొకేలు వద్దు.. పుస్తకాలు ఇవ్వండి

బొకేలు వద్దు.. పుస్తకాలు ఇవ్వండి

విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి

హైదరాబాతీ, వెలుగు:  తెలంగాణ చరిత్ర, ఉద్యమం, సంస్కృతికి సంబంధించిన విషయాలు రాష్ట్ర ప్రజలందరికీ తెలియాలని, అందుకు రాష్ట్ర గ్రంథాలయ సంస్థ చొరవ చూపాలని విద్యాశాఖ మంత్రి పట్లోళ్ల సబితా ఇంద్రారెడ్డి అన్నారు. మంత్రిగా బాధ్యతలు తీసుకున్న తనకు అభినందనలు చెప్పేందుకు వచ్చేవారు పూల బొకేలకు బదులు పుస్తకాలు తేవాలని ఆమె కోరారు. మంత్రిగా బాధ్యతలు చేపట్టిన ఆమెకు మంగళవారం రాష్ట్ర గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఆయాచితం శ్రీధర్ అభినందనలు తెలిపారు. ముఖ్యమంత్రి పీఆర్వో, రచయిత గటిక విజయ్ కుమార్ రాసిన ‘ఉజ్వల ప్రస్థానం’ పుస్తకం కాపీని మంత్రికి అందించారు. పూర్వయుగాల నుంచి తెలంగాణ చరిత్ర, రాజవంశాలు, తెలంగాణ ఉద్యమం, ప్రగతి తదితర అంశాలకు సంబంధించిన ఉజ్వల ప్రస్థానం పుస్తకాన్ని అందుకోవడం ఆనందంగా ఉందని మంత్రి అన్నారు. రాష్ట్రంలోని లైబ్రరీల్లో మౌలిక సదుపాయాలు కల్పించడానికి, మరిన్ని పుస్తకాలు సేకరించడానికి తాను చొరవ చూపుతానని చెప్పారు.

minister-sabitha-indra-reddy-wants-to-wishers-to-bring-books-instead-of-flower-bouquets