
- కాంగ్రెస్ ఎంపీ రఘురామ రెడ్డి ప్రశ్నకు కేంద్రం సమాధానం
న్యూఢిల్లీ, వెలుగు: స్వచ్ఛ్ భారత్ మిషన్– గ్రామీణ్ (ఎస్‌బీఎంజీ) కింద గత మూడేండ్లలో తెలంగాణకు రూ.14.18 కోట్లు కేటాయించామని కేంద్ర జలశక్తి సహాయ మంత్రి సోమన్న తెలిపారు. గురువారం లోక్‌సభలో ఖమ్మం కాంగ్రెస్ ఎంపీ రఘురామ రెడ్డి అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానం ఇచ్చారు. ఎస్‌బీఎంజీ కింద 2021–24 వరకు తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం రూ.748.61 కోట్లు అలాట్ చేసింది.
2021–22 ఏడాదికిగాను రూ.180.67 కోట్లు, 2022–23కుగాను రూ.542.94 కోట్లు, 2023–24కు గాను రూ.25 కోట్లు కేటాయించింది. అయితే ఫస్ట్ రెండేండ్లలో ఒక్క రూపాయి కూడా విడుదల చేయని కేంద్రం.. మూడో ఏడాది కేవలం రూ.14.18 కోట్లు మంజూరు చేసింది. కాగా, రాష్ట్రంలో మొత్తం 9,871 గ్రామాలుండగా.. 8,990 గ్రామాలు ఓపెన్ డెఫికేషన్ ఫ్రీ (బహిర్భుమిలేని గ్రామాలు)గా ప్రకటించినట్లు తెలిపారు.