
- ఇప్పుడు కాంగ్రెస్ సంక్షేమ పథకాలు చూసి ఓర్వలేకపోతున్నరు
ఎల్బీనగర్/గండిపేట/ మేడ్చల్, వెలుగు:పదేండ్ల పాలనలో ఒక్క రేషన్ కార్డ్ ఇయ్యని బీఆర్ఎస్ నాయకులు ఇయ్యాల పేదలకు అందుతున్న సంక్షేమ పథకాలను చూసి ఓర్వలేకపోతున్నారని ఐటీ మినిస్టర్ దుద్దిళ్ల శ్రీధర్ బాబు దుయ్యబట్టారు. మంగళవారం మహేశ్వరం నియోజకవర్గంలోని బాలాపూర్ మండలం మల్లాపూర్‌లో రేషన్ కార్డులు పంపిణీ చేసి, లబ్ధిదారులతో కలిసి భోజనం చేశారు. అలాగే రాజేంద్రనగర్ నియోజకవర్గంలోని ఆరాంఘర్, మేడ్చల్ మండలంలోని అత్వెల్లిలోనూ ప్రభుత్వ చీఫ్ విప్ పట్నం మహేందర్ రెడ్డితో కలిసి రేషన్‌కార్డులు అందజేశారు. రంగారెడ్డి జిల్లాలో 12 వేల కొత్త రేషన్ కార్డుల జారీతో సగటున 50 వేల మందికి సన్న బియ్యం అందుతాయన్నారు. కలెక్టర్లు నారాయణరెడ్డి, మిక్కినినేని మను చౌదరి, ఎమ్మెల్యే టి.ప్రకాశ్ గౌడ్ నరసింహారెడ్డి పాల్గొన్నారు.
పదేండ్ల పాలనలో ఒక్క రేషన్ కార్డ్ ఇయ్యని బీఆర్ఎస్ నాయకులు ఇయ్యాల పేదలకు అందుతున్న సంక్షేమ పథకాలను చూసి ఓర్వలేకపోతున్నారని ఐటీ మినిస్టర్ దుద్దిళ్ల శ్రీధర్ బాబు దుయ్యబట్టారు. మంగళవారం మహేశ్వరం నియోజకవర్గంలోని బాలాపూర్ మండలం మల్లాపూర్‌లో రేషన్ కార్డులు పంపిణీ చేసి, లబ్ధిదారులతో కలిసి భోజనం చేశారు.
అలాగే రాజేంద్రనగర్ నియోజకవర్గంలోని ఆరాంఘర్, మేడ్చల్ మండలంలోని అత్వెల్లిలోనూ ప్రభుత్వ చీఫ్ విప్ పట్నం మహేందర్ రెడ్డితో కలిసి రేషన్‌కార్డులు అందజేశారు. రంగారెడ్డి జిల్లాలో 12 వేల కొత్త రేషన్ కార్డుల జారీతో సగటున 50 వేల మందికి సన్న బియ్యం అందుతాయన్నారు. కలెక్టర్లు నారాయణరెడ్డి, మిక్కినినేని మను చౌదరి, ఎమ్మెల్యే టి.ప్రకాశ్ గౌడ్ నరసింహారెడ్డి పాల్గొన్నారు.