హైదరాబాద్ లో మరో ఫ్లైఓవర్ అందుబాటులోకి వచ్చింది. మైలార్ దేవ్ పల్లి నుంచి శాస్త్రీపురం మీదుగా వట్టేపల్లి వరకు రూ. 71 కోట్ల రూపాయలతో నిర్మించిన ROBని శుక్రవారం ( ఏప్రిల్ 17 ) ప్రారంభించారు మంత్రి శ్రీధర్ బాబు. 490 మీటర్ల పొడవుతో 4 లేన్లతో ఈ ROBని నిర్మించారు. ఈ బ్రిడ్జి అందుబాటులోకి రావడంతో వట్టేపల్లి దగ్గర ఉన్న రైల్వే ట్రాక్ సిగ్నల్స్ ఇబ్బందులు తప్పనున్నాయి.
ఈ కార్యక్రమంలో మంత్రి శ్రీధర్ బాబుతో సహా రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్, ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి, జీహెచ్ఎంసీ కమిషనర్ కర్ణన్, చీఫ్ ఇంజనీర్ సహదేవ్ రత్నాకర్ పాల్గొన్నారు.
శాస్త్రీపురం ROB అందుబాటులోకి రావడంతో మైలార్ దేవ్ పల్లి, ఫలక్ నుమా ఆర్టీసీ డిపో మార్గంలో ప్రయాణం సులభతరం కానుంది. అంతే కాకుండా కనీసం 30 నిమిషాల ప్రయాణ సమయం ఆదా కానుందని అంటున్నారు అధికారులు.

