అంతర్జాతీయ స్థాయిలో స్కిల్ వర్సిటీ.. నిర్మాణ పనులను పరిశీలించిన మంత్రి శ్రీధర్ బాబు

అంతర్జాతీయ స్థాయిలో స్కిల్ వర్సిటీ.. నిర్మాణ పనులను పరిశీలించిన మంత్రి శ్రీధర్ బాబు

ఇబ్రహీంపట్నం, వెలుగు: అన్ని సౌకర్యాలతో అంతర్జాతీయ స్థాయిలో స్కిల్​ యూనివర్సిటీ నిర్మాణం జరుగుతుందని రాష్ట్ర ఐటీ శాఖ, రంగారెడ్డి జిల్లా ఇన్​చార్జి మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు తెలిపారు. రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలంలోని బేగరికంచలో యంగ్​ఇండియా స్కిల్​యూనివర్సిటీ నిర్మాణ పనులను మంగళవారం ఆయన పరిశీలించారు.

అధికారులు, కాంట్రాక్ట్ కంపెనీ ప్రతినిధులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. హైదరాబాద్ ​నైపుణ్యానికి  రాజధానిగా ఎదగాలని ఆలోచనతో ప్రభుత్వం స్కిల్​ యూనివర్సిటీ ఏర్పాటు చేస్తుందన్నారు. మాటలకే పరిమితం కాకుండా ఆ దిశగా చట్టం తీసుకువచ్చి, తాత్కాలికంగా ఇంజినీరింగ్​స్టాఫ్​కాలేజీలో కొనసాగిస్తున్నట్లు చెప్పారు.