బద్మాష్ సంజయ్.. తెలంగాణ ఉద్యమంలో యాడ ఉన్నవు?

బద్మాష్ సంజయ్.. తెలంగాణ ఉద్యమంలో యాడ ఉన్నవు?

 

  • మీ ఇంట్లో వాళ్ల గురించి మాట్లాడితే ఊరుకుంటారా?
  • గీత కార్మికులను అవమానిస్తావా? కల్లు గంగ కన్నా పవిత్రమైనది
  • మీరు సీఎం కేసీఆర్‌ను అంటే.. మేం మోడిని అంటం
  • బండి సంజయ్‌కు మంత్రి శ్రీనివాస్ గౌడ్ వార్నింగ్

మహబూబ్ నగర్: బండి సంజయ్‌పై మంత్రి శ్రీనివాస్ గౌడ్ విరుచుకుపడ్డారు. అభివృద్దిని చూసి ఓర్వలేక పోతున్నాడని ఆయన అన్నారు. ‘సంజయ్ పిచ్చాసుపత్రి నుంచి వచ్చాడా? ఆడవాళ్ళ గురించి సంస్కార హీనంగా మాట్లాడుతున్నాడు. మీ అమ్మ.. అక్కాచెల్లి గురించి మాట్లాడితే సహిస్తారా?  ఆయన ఇట్లా మాట్లాడితే.. పక్కన మరో మహిళ ముసిముసిగ నవ్వుతుంది. సీఎం కేసీఆర్‌ను ఎందుకు జైల్లో పెడతారు? ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేసిన నాయకుడిని ఎలా జైల్లో పెడతారు?  ప్రభుత్వాలు శాశ్వతం కాదు. లాభాలలో ఉన్న కంపెనీలను అదానీ, అంబానీలకు అమ్మినండుకు మోడీని కూడా జైళ్లో పెట్టాలి. బద్మాష్ సంజయ్.. తెలంగాణ ఉద్యమంలో యాడ ఉన్నవు?  నీవు ఇంటికి వెళ్లి నీ భార్యను అడుగు.. ఎట్లా మాట్లాడిన అని.. తూ అని ఉమ్మేస్తది. మీరు ఒక్కటి మాట్లాడితే.. మేము వంద మాట్లాడుతం.  మా భాండారం బయటపెడతారా? మా బండారం మొత్తం అందరికీ తెలుసు. ప్రధానిని మేము గౌరవిస్తాం. మీరు ఉద్యమ నాయకుడు సీఎం కేసీఆర్‌ను అవమానిస్తారా?  కిషన్ రెడ్డి, దత్తాత్రేయలకు విజ్ఞప్తి చేస్తున్నా.. ఈ పిచ్చి కుక్కకు సంస్కారం నేర్పండి. మిమ్మల్ని ఉచ్చరించాలన్నా సిగ్గేస్తుంది. సీఎం కేసీఆర్‌ను కల్లుతో కడగాలని అంటావా? గీత కార్మికులను అవమానిస్తావా? కల్లు గంగ కన్నా పవిత్రమైనది. జాగ్రత్త... నోరు అదుపులో పెట్టుకో. సీఎం కేసీఆర్‌ను అనేటప్పుడు.. పీఎం మోడిని, ఆడవాళ్ళను అనేటప్పుడు.. మీ ఇంట్లో వాళ్లను గుర్తుపెట్టుకొని మాట్లాడు’ అని సంజయ్‌పై మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఫైర్ అయ్యారు.