కెపాసిటీ ఉంది కాబట్టే కేటీఆర్‌కు ఫ్రాన్స్ ఆహ్వానం

కెపాసిటీ ఉంది కాబట్టే కేటీఆర్‌కు ఫ్రాన్స్ ఆహ్వానం

దళితుల సమగ్ర అభివృద్దే సీఎం కేసీఆర్ లక్ష్యమన్నారు మంత్రి శ్రీనివాస్ గౌడ్. దళితులు అభివృద్ది చెందుతుంటే విపక్షాలు ఓర్వలేకపోతున్నాయన్నారు. రాష్ట్రంలో అమలు చేస్తున్న పథకాలు... బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఎందుకు అమలు కావడం లేదని ప్రశ్నించారు.  ఏపీ ప్రజలు కేసీఆర్ లాంటి నాయకుడు కావాలని కోరుకుంటున్నారని చెప్పారు శ్రీనివాస్ గౌడ్. తమ పార్టీ విషయాలు అంతర్గతమని..మీకెందుకని అన్నారు. కేసీఆర్ తర్వాత కేటీఆర్ ఉంటారని..తండ్రికి తగ్గ తనయుడు కేటీఆర్ అని అన్నారు. కేటీఆర్ కు కెపాసిటీ ఉంది కాబట్టే ఫ్రాన్స్ నుంచి ఆహ్వానం వచ్చిందన్నారు.