గత ప్రభుత్వంలో అధికారుల మధ్య సమన్వయం లేదు: మంత్రి తలసాని

గత ప్రభుత్వంలో అధికారుల మధ్య సమన్వయం లేదు: మంత్రి తలసాని

ప్రజా సమస్యలను సత్వరమే పరిష్కరించేందుకు వార్డు కార్యాలయాలను ప్రారంభించామని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. వార్డు కార్యాలయ సేవలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలో వార్డు కార్యాలయాలు ఏర్పాటు చేశారని ఆయన అన్నారు.  నగర ప్రజలకు మరింత వేగంగా పౌర సేవలను అందించడంతో పాటు సమస్యలను వేగంగా పరిష్కరించాలని మంత్రి కేటీఆర్ ఆలోచించారన్నారు మంత్రి తలపాని. ఎస్ ఎన్ డి పి మరియు ఈ వి డి ఎం లను ఏర్పాటు చేసుకున్నామంటూ.. గత ప్రభుత్వంలో  వివిధ శాఖల అధికారులకు మధ్య సమన్వయం ఉండేది కాదని.. ఇప్పుడు అలాంటి ఇబ్బంది లేదన్నారు.   

వార్డు ఆఫీసు వ్యవస్థతో జీహెచ్‌ఎంసీ  ఎలక్ట్రికల్, వాటర్ వర్క్స్, టౌన్ ప్లానింగ్, హార్టికల్చర్, ఎంటమాలజీ తదితర 11 విభాగాలకు చెందిన అధికారులు వార్డు కార్యాలయాల్లో  అందుబాటులో ఉంటారని చెప్పారు. ఇతర ప్రాంతాల వారు హైదరాబాద్ నగరాన్ని చూసి ఆశ్చర్య పోతున్నారని మంత్రి తలసాని తెలిపారు.   సి ఎస్ ఆర్ ఫండ్ తో పార్క్ ల రూపురేఖలు మారుతున్నాయనన్నారు. ఈ కార్యక్రమంలో  మేయర్ గద్వాల్ విజయ లక్ష్మి, ఎమ్మెల్యేలు కాలేరు వెంకటేష్, ముఠా గోపాల్, ఎమ్మెల్సీ ప్రభాకర్, డిప్యూటి మేయర్ మోతే శ్రీలత శోభన్ రెడ్డి పాల్గొన్నారు.