గణేశ్ నిమజ్జనం.. ఓల్డ్ సిటీలో తలసాని పర్యటన

గణేశ్ నిమజ్జనం.. ఓల్డ్ సిటీలో తలసాని పర్యటన

చార్మినార్: ఓల్డ్ సిటీ చార్మినార్ దగ్గర గణేశ్ శోభాయాత్ర ఏర్పాట్లను మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, మేయర్ గద్వాల విజయలక్ష్మి పరిశీలించారు. ఈ సందర్భంగా తలసాని మాట్లాడుతూ.. వినాయక నిమజ్జనానికి ప్రభుత్వం తరఫున అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు. నిమజ్జనంలో పోలీసులది కీలకపాత్ర అన్నారు. అన్ని శాఖల సమన్వయంతో నిమజ్జనం ప్రశాంత వాతావరణంలో సాగుతోందన్నారు. 

‘ప్రశాంత వాతావరణంలో నిమజ్జనం కొనసాగుతోంది. ప్రజలు, భక్తులు సహకరించాలి. చార్మినార్ పరిసర ప్రాంతాల్లో ఏర్పాట్లను పర్యవేక్షించా. ఏర్పాట్లు సంతృప్తికరంగా ఉన్నాయి. భక్తులకు ఎలాంటి ఆటంకం కలగకుండా శోభా యాత్ర సాగుతుంది. హైదరాబాద్ వ్యాప్తంగా 40 వేల విగ్రహాలు నిమజ్జనం కానున్నాయి. రేపు ఉదయం 6 గంటల వరకు నిమజ్జనం కొనసాగే అవకాశం ఉంది. దీనికి సంబంధించి అన్ని శాఖల అధికారులు 24 గంటలు అందుబాటులో ఉంటారు’ అని తలసాని పేర్కొన్నారు. కాగా, బాలాపూర్ వినాయకుడు సాయంత్రం 6 గంటల లోపు సాగర తీరానికి చేరుకుంటారని అంచనా వేస్తున్నారు.