రాష్ట్రాన్ని బద్నాం చేయొద్దు..కేంద్రాన్ని విజ్ఞప్తి చేసినా యూరియా సరఫరా లేదు: మంత్రి తుమ్మల

రాష్ట్రాన్ని బద్నాం చేయొద్దు..కేంద్రాన్ని విజ్ఞప్తి చేసినా యూరియా సరఫరా లేదు: మంత్రి తుమ్మల

కేంద్ర ప్రభుత్వంపై మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు ఆగ్రహం వ్యక్తంచేశారు.అలాట్ మెంట్ చేసిన యూరియాను కేంద్రం సకాలంలో అందించడం లేదని విమర్శించారు. సీఎం రేవంత్ రెడ్డి కేంద్రమంత్రికి విజ్ఞప్తి చేసినా యూరియా అందించడం లేదన్నారు.యూరియా విషయంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు విమర్శలు సరికాదన్నారు. రైతాంగం పట్ల చిత్తశుద్ధి ఉంటే తెలంగాణ బీజేపీ ఎంపీలు మౌనం వీడాలన్నారు.

ALSO READ | వాజ్పేయికి, మోదీకి పొంతనే లేదు.. కార్గిల్ యుద్ధం నాటి పరిస్థితులతో పోల్చుతూ కాంగ్రెస్ విమర్శలు

యూరియా సరఫరాపై కేంద్రంతో ఏప్రిల్ నుంచి అనేక దఫాలుగా చర్చించామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. రాష్ట్రానికి అదనంగా మూడు లక్షల మెట్రిక్ టన్నుల యూరియాను కేటాయించాలన్నారు. ఇప్పటికే జూన్, జూలై నెలల్లో యూరియా సరఫరా తక్కువగా ఉండటంతో, రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో, కేంద్ర ఎరువుల శాఖ మంత్రి జేపీ నడ్డాకు లేఖ లేఖ రాశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఐడీఓసీ కార్యాలయంలో తుమ్మ మాట్లాడుతూ.. 9.8 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా మాత్రమే సరఫరా చేశారన్నారు. 

జూన్లో 45 శాతం లోటు ఉందని తెలిపారు. కేంద్రం ప్రకటనలకు, సరఫరాకు చాలా తేడా ఉందని చెప్పారు. కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షు డు రామచందర్రావుకు కూడా లేఖ రాసినట్లు చెప్పారు. రాష్ట్రప్రభుత్వాన్ని బద్నాం చేసేందుకు రైతులకు అన్యాయం చేయొద్దని సూచించారు. యూరియా సరఫరాకు రాష్ట్ర బీజేపీ నేతలు బాధ్యత తీసుకోవాలన్నారు.