వారం రోజుల్లోగా కాళేశ్వరం ప్రాజెక్టుపై జ్యూడీషియల్ ఎంక్వైరీ వేస్తాం : మంత్రి ఉత్తమ్

వారం రోజుల్లోగా  కాళేశ్వరం ప్రాజెక్టుపై జ్యూడీషియల్ ఎంక్వైరీ వేస్తాం : మంత్రి ఉత్తమ్

వారం రోజుల్లోగా  కాళేశ్వరం ప్రాజెక్టుపై జ్యూడీషియల్ ఎంక్వైరీ వేస్తామన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి.  ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం తప్పుచేసిన వారిని వదిలిపెట్టేది లేదని తేల్చి చెప్పారు.  రిపేర్లకు అయ్యే ఖర్చను నిర్మాణ ఏజేన్సీయే భరించాలన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతి విషయంలో బీఆర్ఎస్ నేతలను కాపాడేందుకు కాంగ్రెస్ ప్రయత్నం చేస్తు్ందని కిషన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను మంత్రి కొట్టిపారేశారు.   బీజేపీ కాంగ్రెస్ ను బద్నాం చేసేందుకు ప్రయత్నిస్తోందని విమర్శించారు.  రూల్స్ మార్చి కేంద్ర సంస్థల నుంచి కాళేశ్వరానికి ఎందుకు రుణాలు ఇచ్చారో చెప్పాలని డిమాండ్ చేశారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి.

అంతకుముందు  కాంగ్రెస్‌, బీఆర్ఎస్ ఒక్కటేనని.. అలా కాదంటే కాళేశ్వరం ప్రాజెక్టుపై సీఎం రేవంత్‌రెడ్డి సీబీఐ విచారణ కోరాలని సవాల్‌ విసిరారు కిషన్ రెడ్డి. కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి లేఖ రాస్తే.. 48 గంటల్లో సీబీఐ తో విచారణ చేయించేందుకు సిద్ధంగా కేంద్రం ఉందన్నారు .  కాంగ్రెస్, బీఆర్ఎస్ డీఎన్‌ఏ ఒక్కటనే అనే   విధంగా ఆ పార్టీల వ్యవహార శైలి ఉందని చెప్పారు. మూడు, నాలుగేళ్లలోనే కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు నిరుపయోగంగా మారిందని చెప్పారు. ఇది కేసీఆర్ సర్కారు అవినీతి, కుంభకోణాలకి అద్దం పడుతోందని కిషన్‌రెడ్డి విమర్శించారు