నిరుద్యోగులకు గుడ్ న్యూస్..అక్టోబర్ 25న హుజూర్ నగర్ లో మెగా జాబ్ మేళా

నిరుద్యోగులకు గుడ్ న్యూస్..అక్టోబర్ 25న హుజూర్ నగర్ లో మెగా జాబ్ మేళా

నల్గొండ జిల్లా హుజూర్ నగర్లో అక్టోబర్  25న జరిగే మెగాజాబ్ మేళాను విజయ వంతం చేయాలని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి .టీజీపీఎస్సీ( తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ )లోనే రిజిస్టర్డ్ అన్ ఎంప్లాయిడ్ పర్సన్స్ 25 లక్షల మంది ఉన్నట్లుగా చెప్పారు. తమ ప్రయత్నం గా నిరుద్యోగులకు మేలు చేసే విధంగా ఫ్లాట్ ఫామ్ క్రియేట్ చేయడానికి జాబ్ మేళా నిర్వహిస్తున్నామన్నారు.  ప్రతి గ్రామానికి జాబ్ మేళా గురించి , ప్రతి నిరుద్యోగి సమాచారం చేరవేయాలన్నారు. 

 గ్రామీణ ప్రాంత నిరుద్యోగ యువతీ యువకులకు ప్రతిభ ఉన్న ప్రతి ఒక్కరికీ మేలు జరిగే విధంగా జాబ్ మేళా నిర్వహించబోతున్నామని తెలిపారు.  అధిక సంఖ్యలో నిరుద్యోగులు పాల్గొని ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.  ఇంత పెద్ద మెగా జాబ్ మేళా ఎక్కడ జరగలేదన్నారు. జాబ్ మేళాకు వచ్చే నిరుద్యోగులకు, ఉదయం టిఫిన్, మధ్యాహ్నం భోజనం, సాయంత్రం టిఫిన్ ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు ఉత్తమ్.  మహిళ నిరుద్యోగులకు, ఉచితంగా ట్రాన్స్ ఫోర్ట్  సౌకర్యం కల్పిస్తున్నట్లు  చెప్పారు.

తెలంగాణ రాష్ట్రం ఏర్పడడానికి ప్రధాన కారణం నిరుద్యోగ సమస్య అని అన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. నిరుద్యోగ సమస్య అధిగమించేందుకు ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుందన్నారు.  ప్రభుత్వ రంగంలో గానీ ప్రైవేట్ రంగంలో గానీ ఉద్యోగ అవకాశాలు కల్పించేది నిరంతర ప్రక్రియ అని చెప్పారు.   కాంగ్రెస్  ప్రభుత్వంలో ఉద్యోగాల భర్తీ ప్రక్రియ నిరంతరం కొనసాగుతుందన్నారు.