మున్సిపాలిటీలను క్లీన్‌‌‌‌‌‌‌‌ స్వీప్‌‌‌‌‌‌‌‌ చేస్తాం : మంత్రి ఉత్తమ్‌‌‌‌‌‌‌‌కుమార్‌‌‌‌‌‌‌‌రెడ్డి

మున్సిపాలిటీలను క్లీన్‌‌‌‌‌‌‌‌ స్వీప్‌‌‌‌‌‌‌‌ చేస్తాం : మంత్రి ఉత్తమ్‌‌‌‌‌‌‌‌కుమార్‌‌‌‌‌‌‌‌రెడ్డి
  • బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్, బీజేపీలకు ఓటేస్తే మురుగు కాల్వలో వేసినట్లే..
  • మంత్రి ఉత్తమ్‌‌‌‌‌‌‌‌కుమార్‌‌‌‌‌‌‌‌రెడ్డి

సూర్యాపేట, వెలుగు : మున్సిపల్‌‌‌‌‌‌‌‌ ఎన్నికల్లో రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీలను కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌ పార్టీ క్లీన్‌‌‌‌‌‌‌‌ స్వీప్‌‌‌‌‌‌‌‌ చేయబోతోందని మంత్రి ఉత్తమ్‌‌‌‌‌‌‌‌కుమార్‌‌‌‌‌‌‌‌ ధీమా వ్యక్తం చేశారు. మున్సిపల్‌‌‌‌‌‌‌‌ ఎన్నికల్లో భాగంగా ఆదివారం రాత్రి సూర్యాపేటలోని గాంధీ చౌరస్తాలో నిర్వహించిన మీటింగ్‌‌‌‌‌‌‌‌లో ఆయన మాట్లాడారు. పేదల కోసం అనేక సంక్షేమ పథకాలు తీసుకురావడం వల్లే ఇటీవల జరిగిన గ్రామపంచాయతీ ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌కు మద్దతుగా నిలిచారన్నారు. అదే మాదిరిగా మున్సిపల్‌‌‌‌‌‌‌‌ ఎన్నికల్లోనూ కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌ క్యాండిడేట్లను ఆశీర్వదించాలని పిలుపునిచ్చారు.

బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌, బీజేపీకి ఓట్లు వేస్తే మురుగు కాల్వలో వేసినట్లే అన్నారు. బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌ హయాంలో దొడ్డుబియ్యంతో రీసైక్లింగ్, బీర్ల వ్యాపారం, అక్రమ వ్యాపారాలు చేశారని ఆరోపించారు. ప్రజలకు సన్నబియ్యం పంపిణీ చేయాలని నిర్ణయించిన కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌.. వాటి సాగు ప్రోత్సహించేందుకు క్వింటాల్‌‌‌‌‌‌‌‌కు రూ.500 బోనస్‌‌‌‌‌‌‌‌ ఇస్తున్నామన్నారు. ప్రతినెల 3.17 కోట్ల మందికి రూ.13,600 కోట్లతో సన్నబియ్యం పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. ఈ పథకంతో ప్రజల్లో మార్పు వచ్చిందన్నారు. కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షుడు గుడిపాటి నర్సయ్య, టూరిజం కార్పొరేషన్‌‌‌‌‌‌‌‌ చైర్మన్‌‌‌‌‌‌‌‌ పటేల్‌‌‌‌‌‌‌‌ రమేశ్‌‌‌‌‌‌‌‌రెడ్డి, ఏఐసీసీ మెంబర రాంరెడ్డి సర్వోత్తమ్‌‌‌‌‌‌‌‌రెడ్డి పాల్గొన్నారు.