V6 News

ఏప్రిల్ 20న మేడిగడ్డకు సీఎం రేవంత్ రెడ్డి

ఏప్రిల్ 20న మేడిగడ్డకు సీఎం రేవంత్ రెడ్డి

  సీఎం రేవంత్ రెడ్డి ఏప్రిల్ 20న కాళేశ్వరం బ్యారేజీలను పరిశీలిస్తారని ఇరిగేషన్ మినిస్టర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారు.  మేడిగడ్డ ,అన్నారం,సుందిళ్ల బ్యారేజీలను విజిట్ చేస్తారని అన్నారు . 

ఢిల్లీలో ఎన్డీఎస్ఏ అధికారులతో కాశేశ్వరం గురించి చర్చించామని చెప్పారు. కాళేశ్వరం రిపేర్లలో అంతర్జాతీయ సంస్థ ఆఫ్రీ భాగస్వామ్యం ఉందన్నారు. గోదావరిలోకి వరద వచ్చేలోపు సాయిల్ టెస్టులు పూర్తి చేయాలని నిర్ణయించినట్లు చెప్పారు. కాళేశ్వరం బీఆర్ఎస్ కట్టింది..వారి హయాంలోనే కూలిపోయిందన్నారు. కాళేశ్వరంపై తమ ప్రభుత్వానికి దురుద్దేశంలేదన్నారు ఉత్తమ్.  ఎన్డీఎస్ఏ  మార్గదర్శకాలకు అనుగుణంగా ముందుకెళ్తామని ఉత్తమ్ చెప్పారు. 

మరో వైపు కాశేళ్వర మూడు బ్యారేజీల పునరుద్ధరకు కేంద్రం ప్రత్యేక కమిటీ వేసినట్లు తెలుస్తోంది. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల మరమ్మతులకు సమన్వయ కమిటీ వేసినట్లు సమాచారం.