FIFA World Cup Trophy: ఫుట్‌బాల్ ప్రపంచంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన ఫిఫా వరల్డ్ కప్ 2026 ట్రోఫీ ప్రదర్శనలో ఈసారి లగ్జరీ బ్రాండ్ లూయిస్ విట్టన్ (Louis Vuitton) సరికొత్త హంగులను జోడించనుంది. ఈ మెగా టోర్నమెంట్‌కు అధికారిక సప్లయర్, బ్రాండెడ్ లైసెన్సీగా ఫ్రాన్స్‌కు చెందిన ప్రముఖ లగ్జరీ ఫ్యాషన్ హౌస్ లూయిస్ విట్టన్ ఎంపికైంది. న్యూయార్క్-న్యూజెర్సీ స్టేడియంలో జరగబోయే గ్రాండ్ ఫైనల్ మ్యాచ్ సందర్భంగా, ప్రత్యేకంగా డిజైన్ చేసిన లూయిస్ విట్టన్ ట్రంక్ (సూట్‌కేస్)లో ఈ ప్రపంచకప్ ట్రోఫీని భద్రపరిచి మైదానంలోకి తీసుకురానున్నారు. 2010 నుంచి కొనసాగుతున్న సాంప్రదాయాన్ని పాటిస్తూ, ఒక లూయిస్ విట్టన్ అంబాసిడర్, ఫిఫా లెజెండ్ కలిసి ఈ ట్రోఫీని ఫైనల్ వేదికపై అఫీషియల్ సెర్మనీలో భాగంగా ప్రదర్శిస్తారు.
ట్రంక్ ప్రత్యేకతలు.. విక్టరీకి కేరాఫ్ అడ్రస్:
ఈ ప్రత్యేకమైన ట్రోఫీ ట్రంక్‌ను అత్యంత విలాసవంతంగా రూపొందించారు. దీనిపై లూయిస్ విట్టన్ ఐకానిక్ మోనోగ్రామ్ కాన్వాస్ డిజైన్‌తో పాటు చేతితో పెయింట్ చేసిన బంగారు రంగు "V" ప్యానెల్‌లు ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి. ఈ "V" అనే అక్షరం అటు విక్టరీ (విజయం), ఇటు విట్టన్ (బ్రాండ్ పేరు)కు ప్రతీకగా నిలుస్తుంది. అంతేకాదు, దీనికి బంగారు పూత పూసిన బ్రాస్ ఫిట్టింగ్‌లు, లెదర్ ట్రిమ్‌లు, క్లాసిక్ లాక్‌లను అమర్చారు. ఆధునిక ఫుట్‌బాల్ శిఖరాగ్రానికి, సాంప్రదాయ హస్తకళకు ఈ ట్రంక్ ఒక అద్భుతమైన కలయిక అని ఫిఫా చీఫ్ బిజినెస్ ఆఫీసర్ రోమి గై తెలియజేశారు.
ALSO READ : సూపర్ కంప్యూటర్ జ్యోతిష్యం : ఫుట్ బాల్ వరల్డ్ కప్ గెలిచేది ఆ జట్టే..
2010 నుంచి కొనసాగుతున్న విజయ ప్రయాణం:
లూయిస్ విట్టన్, ఫిఫా మధ్య బంధం ఈనాటిది కాదు.. ఇది 2010 సౌతాఫ్రికా వరల్డ్ కప్ నుంచి ప్రారంభమైంది. ఆ తర్వాత బ్రెజిల్, రష్యా, ఖతార్ వరల్డ్ కప్ ఎడిషన్లలో కూడా విక్టరీ ట్రావెల్స్ ఇన్ లూయిస్ విట్టన్ (Victory travels in Louis Vuitton) అనే కాన్సెప్ట్‌తో ఈ బ్రాండ్ ట్రోఫీ ట్రంక్‌లను విజయవంతంగా తయారు చేసింది. క్రీడలకు ఉన్న స్ఫూర్తిని, సామూహిక ప్రతిష్టను ప్రతిబింబించేలా ఈ భాగస్వామ్యం 2026లో కూడా కొనసాగుతుండటంపై లూయిస్ విట్టన్ చైర్మన్ & సీఈఓ పియట్రో బెక్కారి హర్షం వ్యక్తం చేశారు. ఫైనల్ మ్యాచ్ ముంగిట మైదానంలో ఈ చారిత్రాత్మక లగ్జరీ ట్రంక్ ఎంట్రీ కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా వేచి చూస్తున్నారని వెల్లడించాడు.
Louis Vuitton to present bespoke trophy trunk at @FIFAWorldCup final!
— FIFA (@FIFAcom) July 14, 2026
Louis Vuitton has been named Official Supplier and Branded Licensee of the FIFA World Cup 2026, presenting the official bespoke trophy trunk designed to transport and showcase the most iconic trophy in sports:
Louis Vuitton's FIFA World Cup 2026 Trophy Trunk. pic.twitter.com/KWX8VMJUfA
— VastLand. (@VastLandd) July 15, 2026
