
- ప్రజాభవన్‌లో మంత్రి ఉత్తమ్ నేతృత్వంలో అవగాహన
హైదరాబాద్, వెలుగు: కాళేశ్వరం ప్రాజెక్టులో గత బీఆర్ఎస్ సర్కారు అక్రమాలు, మేడిగడ్డ కుంగుబాటుపై నిజాలేంటో ప్రజలకు వివరించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధమైంది. ప్రాజెక్టుపై బీఆర్ఎస్ హయాంలో తీసుకున్న నిర్ణయాలపై పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనున్నది. బుధవారం ప్రజాభవన్‌లో ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి నేతృత్వంలో నిర్వహించనున్న ఈ పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ హాజరుకానున్నారు.
మంత్రులు, కాంగ్రెస్ ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, కా ర్పొరేషన్ చైర్మన్లకు అవగాహన కల్పించనున్నారు. ఇప్పటికే ఏపీ నిర్మిస్తున్న పోలవరం బనకచర్ల లింక్ ప్రాజెక్టుపై పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చిన ప్రభుత్వం.. ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టుపై సమగ్ర వివరాలు తెలియజేయనున్నది. అలాగే, 2014 నుంచి 2023 మధ్య బీఆర్ఎస్ హయాంలో ఏపీకి అక్రమంగా తరలించిన కృష్ణా జలాల లెక్కనూ మంత్రి ఉత్తమ్ వివరించనున్నారు.