సింగూరుకు తొందరగా రిపేర్లు చేయండి... ఎన్డీఎస్ఏ నిబంధనల మేరకు పనులు జరగాలి: మంత్రి ఉత్తమ్

సింగూరుకు తొందరగా రిపేర్లు చేయండి... ఎన్డీఎస్ఏ నిబంధనల మేరకు పనులు జరగాలి: మంత్రి ఉత్తమ్
  • జూన్​ 26లోగా ప్రాజెక్టు కెనాల్స్​ లైనింగ్​ పనులు పూర్తిచేయాలి
  • ములుగు జిల్లాలో ప్రాజెక్టుల భూసేకరణకు 15 రోజుల్లో అంచనాలివ్వాలి
  • రామప్ప- లక్నవరం ఇంటర్ ​లింకింగ్​ కు అదనపు నిధులిచ్చేందుకు సిద్ధమని వెల్లడి
  • ఉమ్మడి మెదక్, ములుగు జిల్లాల ప్రాజెక్టులపై సెక్రటేరియెట్​లో మంత్రులతో కలిసి రివ్యూ

హైదరాబాద్, వెలుగు: నేషనల్​ డ్యామ్​ సేఫ్టీ అథారిటీ (ఎన్​డీఎస్​ఏ) నిబంధనల మేరకు సింగూరు డ్యామ్​కు తొందరగా రిపేర్లు చేయాలని అధికారులను మంత్రులు ఉత్తమ్​ కుమార్​ రెడ్డి, వివేక్​ వెంకటస్వామి, దామోదర రాజనర్సింహా ఆదేశించారు. డ్యామ్​ సేఫ్టీ పనుల కోసం టెక్నికల్​ కమిటీని ఏర్పాటు చేయాలని సూచించారు. బుధవారం సెక్రటేరియెట్​లో ఉమ్మడి మెదక్​ జిల్లాలోని ఇరిగేషన్​ ప్రాజెక్టులపై సమీక్ష నిర్వహించారు. 

దాంతో పాటు మంత్రి ఉత్తమ్, మంత్రులు సీతక్క, పొంగులేటి శ్రీనివాస్​ రెడ్డితో కలిసి ములుగు జిల్లాలోని ప్రాజెక్టులపైనా రివ్యూ చేశారు. ఆందోల్​ నియోజకవర్గంలో 40 వేల ఎకరాలకు సాగునీరు అందించే పెద్దారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీం డీపీఆర్​లను వేగంగా రూపొందించాలని, ఉగాదిలోపు ప్రాజెక్టు పనులకు శంకుస్థాపన చేయాలని అధికారులను మంత్రులు ఆదేశించారు. 

డ్యామ్​ సేఫ్టీ పనుల కోసం టెక్నికల్​ కమిటీని ఏర్పాటు చేయాలని సూచించారు. బుధవారం సెక్రటేరియెట్​లో ఉమ్మడి మెదక్​ జిల్లాలోని ఇరిగేషన్​ ప్రాజెక్టులపై సమీక్ష నిర్వహించారు. దాంతో పాటు మంత్రి ఉత్తమ్, మంత్రులు సీతక్క, పొంగులేటి శ్రీనివాస్​ రెడ్డితో కలిసి ములుగు జిల్లాలోని ప్రాజెక్టులపైనా రివ్యూ చేశారు. ఆందోల్​ నియోజకవర్గంలో 40 వేల ఎకరాలకు సాగునీరు అందించే పెద్దారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీం డీపీఆర్​లను వేగంగా రూపొందించాలని, ఉగాదిలోపు ప్రాజెక్టు పనులకు శంకుస్థాపన చేయాలని మంత్రులు అధికారులను ఆదేశించారు. 

సింగూరు ప్రాజెక్టు కెనాల్స్​ లైనింగ్ పనులను జూన్ 26లోగా పూర్తి చేయాలని, జులైలోపు పంటలకు నీళ్లివ్వాలని సూచించారు. సింగూర్ ప్రాజెక్టు సుందరీకరణ, పరిరక్షణ పనులను వెంటనే ప్రారంభించాలన్నారు. ఆందోల్ నియోజకవర్గంలో చిన్న నీటి ప్రాజెక్టులైన చెరువుల పునరుద్ధరణ పనుల టెండర్లు పూర్తి చేసి ఈ సీజన్​లో రైతులకు సాగునీరు అందించాలని ఆదేశించారు. 

15 రోజుల్లో భూసేకరణ అంచనాలివ్వండి

ములుగు జిల్లాలో ప్రాజెక్టులను అత్యంత ప్రాధాన్యంగా తీసుకోవాలని మంత్రులు ఉత్తమ్, సీతక్క, పొంగులేటి సూచించారు. వివిధ ప్రాజెక్టులకు సంబంధించిన భూసేకరణకు 15 రోజుల్లో అంచనాలు, ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఆదేశాలిచ్చారు. నష్టపరిహారం వెంటనే చెల్లించి పనులను ప్రారంభిస్తామన్నారు. ములుగు నియోజకవర్గ ప‌‌‌‌రిధిలో 1,10,632 ఎకరాల ఆయకట్టు లక్ష్యంగా సాగునీటి ప్రాజెక్టులు అమలులో ఉన్నాయని అధికారులు వివరించారు. 

దేవాదుల‌‌‌‌, ఎస్సారెస్పీ స్టేజ్–I, రామప్ప పాకాల లిఫ్ట్ ఇరిగేషన్, సమ్మక్కసాగర్, పోట్లాపూర్ ఎత్తిపోత‌‌‌‌లు, పాలెం వాగు ప్రాజెక్టు, మోడి కుంట వాగు, ఫ్లడ్​ బ్యాంక్​ తదితర పనులపైనా మంత్రులు ఆరా తీశారు. మంత్రులే రైతుల వద్దకెళ్లి భూసేకరణ ప్రక్రియను చేపడతారన్నారు. గత ప్రభుత్వం భూ సేకరణ, పరిహారం అంశాల్లో మొండిగా వ్యవహరించిందని విమర్శించారు. రామప్ప – లక్నవరం ఇంటర్ లింకింగ్ పనులకు అదనపు నిధులు కేటాయించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు. జిల్లా అధికార యంత్రాంగం, ఇరిగేషన్ శాఖలు సమన్వయంతో పనిచేసి ములుగు రైతులకు త్వరితగతిన సాగునీరు అందించాలని ఆదేశించారు. 

దేవాదుల ప్రాజెక్టుకు అవసరమైన భూ సేకరణపై 15 రోజుల్లో మరోసారి ప్రత్యేక సమావేశం నిర్వహిస్తామని తెలిపారు. సమ్మక్కసాగర్​ ప్రాజెక్టుకు చత్తీస్​గఢ్​ అభ్యంతరాలు వ్యక్తం చేస్తోందని, అక్కడ ముంపు బాధితులకు తగిన పరిహారం చెల్లించి సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. పనులను పెండింగ్​ పెట్టొద్దని, వెంటనే పూర్తి చేయాలని కాంట్రాక్టర్లకు సూచించారు. కాగా, ములుగు జిల్లాలో కొనసాగుతున్న ప్రాజెక్టుల పురోగతిపై ప్రతి వారం నివేదిక ఇవ్వాలని మంత్రి సీతక్క అధికారులను ఆదేశించారు. రివ్యూ అనంతరం ఆమె తన ఛాంబర్​లో అధికారులతో సమావేశమయ్యారు.  

గత పాలకుల నిర్లక్ష్యంతో ములుగు తలాపున గోదావరి ప్రవహిస్తున్నప్పటికీ, ఆ నీటిని వినియోగించుకోలేని పరిస్థితి ఏర్పడిందన్నారు. ములుగు జిల్లాలో రెండో పంటకు సాగునీరు అందించడమే లక్ష్యంగా అధికారులు కృషి చేయాలన్నారు. ప్రతి వాగులో ఏడాది పొడవునా నీరు నిల్వ ఉండేలా చర్యలు తీసుకోవాలని, అవసరమైన చోట్ల చెక్‌‌‌‌డ్యామ్‌‌‌‌లు నిర్మించి సాగు, తాగునీటి అవసరాలు తీర్చాలని సూచించారు.


హైదరాబాద్​ తాగునీటికి సింగూరు గుండెకాయ​

హైదరాబాద్​కు తాగునీటిని సరఫరా చేసే సింగూరు ప్రాజెక్టును కాపాడేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని ఇరిగేషన్​శాఖ మంత్రి ఉత్తమ్​ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. హైదరాబాద్​ తాగునీటికి సింగూరు గుండెకాయ అన్నారు. సింగూరు డ్యామ్​ రిపేర్లకు సంబంధించి సోనార్​ ఇన్వెస్టిగేషన్లు, అండర్​ వాటర్​ సర్వేలు చేయాలని, తద్వారా లోపల ఏమైనా డ్యామేజీలు ఏమైనా ఉన్నాయేమో గుర్తించాల్సిందిగా అధికారులను ఆదేశించారు. నీటిని ఖాళీ చేయకుండానే సర్వేలు చేయాలని, రెండు మూడు రోజుల్లో రిపోర్టును సబ్​మిట్​ చేయాలని తేల్చి చెప్పారు. త్వరలోనే డ్యామ్​ను సందర్శిస్తానని పేర్కొన్నారు. 

క్రాప్​ హాలిడేస్​ లేకుండా పనులను వెంటనే పూర్తి చేయాలని కాంట్రాక్టర్లకు తేల్చి చెప్పారు. సింగూరు కెనాల్​ లైనింగ్​ను త్వరగా పూర్తి చేయాలని, 13 కిలోమీటర్ల లైనింగ్​లో ఇప్పటికే 9 కిలోమీటర్లు పూర్తయిందని, మిగతా 4 కిలోమీటర్లు కూడా పూర్తి చేయాలన్నారు. కాగా, ములుగు జిల్లాలోని దేవాదుల సహా పెండింగ్​లో ఉన్న ప్రాజెక్టుల పూర్తికి కట్టుబడి ఉన్నామన్నారు. 

రాష్ట్రవ్యాప్తంగా ప్రాజెక్టులకు భూసేకరణ పెండింగ్​ ఉందని, భూసేకరణ కోసమే ప్రత్యేకంగా రూ.5 వేల కోట్లు సీఎం రేవంత్ రెడ్డి​కేటాయించారని, జూన్​ 2లోపు పూర్తి చేసేలా టార్గెట్​ పెట్టుకున్నామని చెప్పారు. పాలెంవాగు గేట్ల సమస్యను కూడా పరిష్కరిస్తామన్నారు. వెంటనే ప్రాజెక్టును సందర్శించి ప్రాజెక్టు పరిస్థితిని పరీక్షించాల్సిందిగా ఓఎస్డీ భీంప్రసాద్​ను ఆయన ఆదేశించారు.