ఎన్ని అడ్డంకులొచ్చినా 42 శాతం ఇచ్చి తీరుతాం.. బీసీ బంద్ లో మంత్రి వాకిటి శ్రీహరి

ఎన్ని అడ్డంకులొచ్చినా 42 శాతం ఇచ్చి తీరుతాం.. బీసీ బంద్ లో మంత్రి వాకిటి శ్రీహరి

తెలంగాణ వ్యాప్తంగా బీసీ బంద్ విజయవంతంగా కొనసాగుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా బీసీ సంఘాలు, రాజకీయ పార్టీలు స్వచ్ఛందంగా బంద్ లో పాల్గొంటున్నాయి. ఆర్టీసీ బస్సులు ఎక్కడిక్కడ డిపోల్లో నిలిచిపోయాయి.

 బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల బిల్లులపై కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానానికి వ్యతిరేకంగా  మంత్రి వాకిటి శ్రీహరి  బీసీ బంద్ లో పాల్గొన్నారు. ఆర్టీసీ క్రాస్ రోడ్ పక్కన ముషీరాబాద్ డిపో2 వద్ద బైఠాయించి నిరసన వ్యక్తం  చేశారు మంత్రి.  ఈ కార్యక్రమంలో  ఎంపీ అనిల్ కుమార్ యాదవ్, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.  బీసీలకు  42 శాతం రిజర్వేషన్ కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం పంపించిన  బిల్లులను కేంద్రం వెంటనే ఆమోదం తెలపాలని డిమాండ్  చేశారు.

ఈ సందర్బంగా మాట్లాడిన మంత్రి వాకిటి శ్రీహరి 42 శాతం బీసీ రిజర్వేషన్లకు  కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధితో ఉందన్నారు. ఎన్ని అడ్డంకులు వచ్చినా 42 శాతం బీసీ రిజర్వేషన్ ఇచ్చే కమిటీ మెంట్ తమకు ఉందన్నారు.  అధికారంలో ఉండి కూడా బంద్ లో పాల్గొన్నామని చెప్పారు వాకిటి.  కాంగ్రెస్ పార్టీ బడుగు బలహీనవర్గాల పక్షాన ఉంటుందన్నారు.  42 శాతం బీసీ రిజర్వేషన్ పై బీఆర్ ఎస్ అనవసర ఆరోపణలు చేస్తుందన్నారు. 

బీఆర్ఎస్ హయాంలో ముగ్గురు బీసీ మంత్రులు ఉన్నా కూడా 50  శాతం రిజర్వేషన్లు చాలని ఎన్నికలకు పోయిన మీరా తమ గురించి మాట్లాడేదని ప్రశ్నించారు. బీఆర్ఎస్ నేతలు  తమపై ఆబండాలు వేసి పబ్బం గడుపుతున్నారని ఫైర్ అయ్యారు.  ఎవ్వరు ఎన్ని ఆరోపణలు చేసినా.. అసత్య ప్రచారాలు చేసినా 42 శాతం బీసీ రిజర్వేషన్ ఇచ్చి తీరుతమన్నారు  మంత్రి వాకిటి