మక్తల్ రూపు రేఖలు మారుస్తాం : మంత్రి వాకిటి శ్రీహరి

మక్తల్ రూపు రేఖలు మారుస్తాం : మంత్రి వాకిటి శ్రీహరి
  • మంత్రి వాకిటి శ్రీహరి 

మక్తల్, వెలుగు : ‘మక్తల్​లో నాకు మచ్చ తెచ్చేలా బీఆర్ఎస్, బీజేపీలు జతకట్టాయి. కానీ నేను మక్తల్ మున్సిపాలిటీని అభివృద్ధి చేసి పట్టణ రూపురేఖలే మారుస్తా. అలా చేయకపోతే వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.  ప్రజలు విజ్ఞతతో ఆలోచించి ఓటు వేయాలి’ అని మంత్రి వాకిటి శ్రీహరి కోరారు. సోమవారం మక్తల్​లో కాంగ్రెస్ పార్టీ క్యాండిడేట్లకు మద్దతుగా ఆయన ప్రచారం నిర్వహించారు. ఇంటింటికీ తిరుగుతూ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను వివరించారు. అంతకుముందు పట్టణంలో వాసవి ఆలయం నుంచి భారీ ర్యాలీ నిర్వహించారు. 

అంబేద్కర్ చౌరస్తా వద్ద ఏర్పాటు చేసిన కార్నర్ మీటింగ్​లో మంత్రి మాట్లాడారు.  గత ఐదేండ్లలో మక్తల్ మున్సిపాల్టీకి మాజీ ఎమ్మెల్యే చిట్టెం రాంమోహన్ రెడ్డి ఏం చేశారో సమాధానం చెప్పాలని సవాల్ విసిరారు. అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగాలంటే అధికారంలో ఉన్న కాంగ్రెస్​ను మున్సిపల్​ ఎన్నికల్లో గెలిపిస్తేనే సాధ్యమవుతుందని తెలిపారు.