- కేసీఆర్, కేటీఆర్, హరీశ్ రావుకు మంత్రి వెంకట్ రెడ్డి చురకలు
శామీర్ పేట వెలుగు: మాజీ సీఎం కేసీఆర్, కేటీఆర్, హరీశ్ రావు.. ముందు మీ ఇంట్లో పంచాదీ తేల్చుకోవాలని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి సూచించారు. వచ్చే మున్సిపల్ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు గెలుపొందడం ఖాయమని, లేకపోతే తాను దేనికైనా సిద్ధమని కేటీఆర్‌కు సవాల్ విసిరారు. మేడ్చల్ జిల్లా మూడు చింతలపల్లి, అలియాబాద్, ఎల్లంపేట మున్సిపాలిటీలకు చెందిన ముఖ్య కార్యకర్తల సమావేశం బుధవారం శామీర్‌పేట్‌లో జరిగింది.
ఈ సందర్భంగా మంత్రి వెంకట్ రెడ్డి మాట్లాడుతూ.. పదేండ్ల దొర పాలనలో విసుగు చెందిన రాష్ట్ర ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గెలిపించారన్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో పోలీసులను బెదిరిస్తూ మరో రెండేండ్లలో తమ ప్రభుత్వమే వస్తుందని కేటీఆర్ జోకులు వేస్తున్నారన్నారు. మున్సిపాలిటీ ఎలక్షన్‌లో బీఆర్ఎస్ 10 శాతం సీట్లు గెలిచినా దేనికైనా రెడీ అంటూ మంత్రి చాలెంజ్ విసిరారు.
