
మెహిదీపట్నం, వెలుగు: షేక్ పేటలోని ఆదిత్య ఇంప్రెస్ టవర్‌లో కొలువుదీరిన గణనాథుడికి గురువారం రాత్రి రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి, సరోజ దంపతులు పూజలు నిర్వహించారు. ప్రజలందరికీ వినాయకుడి ఆశీస్సులు ఉండాలని సంకల్పించారు. అనంతరం మహిళలతో కలిసి కోలాటం ఆడుతూ ఉత్సాహం నింపారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు దుర్గాప్రసాద్, సుభాష్ రెడ్డి, మదన్మోహన్, సంజీవ, నవనీత్, వెంకట్, ప్రవీణ్, శ్రీకాంత్, శివకుమార్ పాల్గొన్నారు.
మంత్రిని కలిసిన జూబ్లీహిల్స్ఫోరం..
జూబ్లీహిల్స్: మంత్రి వివేక్‌ను జూబ్లీహిల్స్ ఫోరం సభ్యులు బుధవారం కలిశారు. కాలనీలు, బస్తీల అభివృద్ధిపై ఫోరం అధ్యక్షుడు ఆసిఫ్ సోహెల్మంత్రితో చర్చించారు. షేక్‌పేట పరిధి సూర్యనగర్‌లో రూ.5 కోట్ల విలువైన పనులను తక్షణమే ప్రారంభించాలని జీహెచ్ఎంసీ కమిషనర్‌ను వివేక్ఆదేశించారు. కార్యక్రమంలో 300 కాలనీలకు సంబంధించిన ఫోరం ప్రతినిధులు పాల్గొన్నారు.