జూబ్లీహిల్స్, వెలుగు: సమష్టి కృష్టితోనే జూబ్లీహిల్స్ విజయం సాధ్యమైందని మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి తెలిపారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు ఇన్చార్జి మంత్రిగా పనిచేసిన ఆయనను శుక్రవారం పలువురు కలిసి అభినందించారు. షేక్ పేటలో మంత్రి వివేక్‌ను.. ఎంపీ అనిల్‌కుమార్ యాదవ్, పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి, నేతలు నీలం మధు, ఫయీమ్ ఖురేషి తదితరులు కలిసి శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో చాలా ఏండ్ల తర్వాత కాంగ్రెస్ అభ్యర్థి విజయం సాధించారన్నారు. ఇది పార్టీకి నూతన ఉత్తేజాన్ని ఇస్తుందన్నారు. షేక్ పేట డివిజన్ బూత్ లెవెల్లో కార్యకర్తలను, నాయకులను సమన్వయం చేస్తూ పనిచేసిన నేతలను ఈ సందర్భంగా మంత్రి అభినందించారు.
