మల్కాజ్ గిరిలో స్టడీ హాల్ ను ప్రారంభించిన మంత్రి వివేక్

మల్కాజ్ గిరిలో స్టడీ హాల్ ను ప్రారంభించిన మంత్రి వివేక్

మల్కాజ్ గిరి నియోజకవర్గంలోని గ్రీన్ హిల్స్ కాలనీలో రాధా స్టడీహాల్‌ను రాష్ట్ర మంత్రి వివేక్ వెంకటస్వామి  ప్రారంభించారు. స్థానిక ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి, కార్పొరేటర్ బొంతు శ్రీదేవి, ఇతర ముఖ్య నేతలతో కలిసి మంత్రి రిబ్బన్ కట్ చేసి ఈ స్టడీహాల్‌ను ప్రారంభించారు. 

ఈ సందర్భంగా మంత్రి వివేక్ వెంకటస్వామి మాట్లాడుతూ... నగరంలోని రద్దీ ప్రాంతాల్లో విద్యార్థులకు చదువుకోవడానికి ప్రశాంతమైన వాతావరణం అవసరమని, అటువంటి చక్కని వసతులతో ఈ స్టడీహాల్‌ను అందుబాటులోకి తెచ్చిన నిర్వాహకులు రాధా రవి దంపతులను ఆయన ప్రత్యేకంగా అభినందించారు.

స్టడీహాల్‌లోని వసతులను పరిశీలించిన మంత్రి, అక్కడ చదువుకుంటున్న విద్యార్థులతో కాసేపు ముచ్చటించారు. పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే యువతకు ఇది ఎంతగానో ఉపయోగపడుతుందని, విద్యార్థులందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆయన ఆకాంక్షించారు.అనంతరం, బస్ స్టాండ్ సమీపంలో ఉన్న భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్, విప్లవ వీరులు మహాత్మా జ్యోతిరావు పూలే, సావిత్రిబాయి పూలే విగ్రహాలకు మంత్రిలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.