హైదరాబాద్: డెలివరీ రైడర్లు, గిగ్ వర్కర్ల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన Upzy Houseను కొండాపూర్‌లో కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి గ్రాండ్‌గా ప్రారంభించారు. హైటెన్షన్ లైన్ రోడ్‌లో ఏర్పాటు చేసిన ఈ కేంద్రం గిగ్ వర్కర్లకు విశ్రాంతి తీసుకునేందుకు, రోజువారీ అవసరాలు తీర్చుకునేందుకు ఉపయోగపడనుంది.
Upzy Houseలో డెలివరీ రైడర్లు, గిగ్ వర్కర్ల కోసం పలు సౌకర్యాలను అందుబాటులోకి తీసుకురానున్నారు. ముఖ్యంగా AC సీటింగ్, శుభ్రమైన టాయిలెట్లు, భోజనం, మొబైల్ ఛార్జింగ్ వంటి సదుపాయాలు కల్పించారు. ఉదయం 6 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు Upzy House సేవలు అందుబాటులో ఉంటాయి.
డెలివరీ రైడర్లు నగరంలో పని చేసే సమయంలో ఎదుర్కొంటున్న సమస్యలపై కూడా కార్యక్రమంలో చర్చించారు. పని మధ్యలో విశ్రాంతి తీసుకోవడానికి, ప్రాథమిక సౌకర్యాలు వినియోగించుకోవడానికి ఇలాంటి కేంద్రాలు ఉపయోగపడతాయని నిర్వాహకులు తెలిపారు.Upzy House ప్రారంభ కార్యక్రమానికి కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా గిగ్ వర్కర్లు ఎదుర్కొంటున్న సమస్యలు, వారికి అవసరమైన ప్రాథమిక సౌకర్యాలపై చర్చ జరిగింది.డెలివరీ, క్యాబ్, ఇతర ప్లాట్‌ఫామ్ ఆధారిత సేవల్లో పనిచేస్తున్న గిగ్ వర్కర్లకు పని ప్రదేశాల్లో తగిన విశ్రాంతి, టాయిలెట్ వంటి సదుపాయాలు అందుబాటులో ఉండటం ముఖ్యమని కార్యక్రమంలో పేర్కొన్నారు.
4,163 మంది గిగ్ వర్కర్లపై Upzy సర్వే
గిగ్ వర్కర్ల పరిస్థితులపై Upzy నిర్వహించిన సర్వేలో కీలక విషయాలు వెల్లడయ్యాయి. మొత్తం 4,163 మంది గిగ్ వర్కర్లను ఈ సర్వేలో భాగం చేశారు.సర్వే ప్రకారం.. దాదాపు 90 శాతం మంది గిగ్ వర్కర్లు రోడ్డుపక్కన లేదా పబ్లిక్ టాయిలెట్లను ఉపయోగిస్తున్నట్లు వెల్లడైంది. మరోవైపు కేవలం 5 శాతం మంది గిగ్ వర్కర్లకే కంపెనీల నుంచి టాయిలెట్ సౌకర్యం అందుతున్నట్లు సర్వేలో తేలింది.ఈ పరిస్థితుల నేపథ్యంలో గిగ్ వర్కర్లకు అవసరమైన ప్రాథమిక సదుపాయాలను అందించేందుకు Upzy Houseను ఏర్పాటు చేసినట్లు నిర్వాహకులు తెలిపారు. కొండాపూర్‌లో ప్రారంభమైన Upzy House ద్వారా నగరంలోని డెలివరీ రైడర్లు, ఇతర గిగ్ వర్కర్లకు పని సమయంలో విశ్రాంతి, టాయిలెట్, భోజనం, మొబైల్ ఛార్జింగ్ వంటి సౌకర్యాలు ఒకే చోట అందుబాటులోకి రానున్నాయి.
