హైదరాబాద్: కొత్తగా ఏర్పాటైన మున్సిపాలిటీలను రాజకీయాలకు అతీతంగా అభివృద్ధి చేస్తామని మంత్రి వివేక్ వెంకటస్వామి పేర్కొన్నారు. మంగళవారం (మే 19) సంగారెడ్డి జిల్లా గడ్డపోతారం మున్సిపాలిటీలో పలు అభివృద్ధి పనులకు ఆయన శంఖుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి వివేక్ మాట్లాడుతూ.. పఠాన్ చెరు నియోజకవర్గంలో కొత్తగా ఏర్పడ్డ మున్సిపాలిటీల అభివృద్ధికి ప్రభుత్వం రూ.75కోట్ల నిధులు మంజూరు చేసిందని తెలిపారు.
గుమ్మడిదల-కానుకుంట రోడ్డుకు రూ.7 కోట్ల 20 లక్షలు మంజూరు అయ్యాయని.. త్వరలో పనులు ప్రారంభిస్తామన్నారు. గుమ్మడిదల మున్సిపల్ చైర్మన్ ప్రతిపాదించిన సమస్యలన్నిటికీ పరిష్కారం దిశగా చర్యలు చేపడతామన్నారు. భూమి కోల్పోయిన రైతులకు వంద గజాల చొప్పున స్థలాలు కచ్చితంగా ఇస్తామన్నారు. కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం పేద ప్రజల అభివృద్ధి, ప్రాంతాల అభివృద్ధి కోసం నిరంతరం పనిచేస్తుందని తెలిపారు.
