
- పార్టీ చీఫ్ ఇంటికెళ్లి విష్ చేసిన మంత్రి వివేక్, ఎంపీలు వంశీకృష్ణ, చామల
న్యూఢిల్లీ, వెలుగు: ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు మంత్రి వివేక్ వెంకటస్వామి, ఎంపీలు వంశీకృష్ణ, చామల కిరణ్ కుమార్ రెడ్డి బర్త్ డే విషెస్ చెప్పారు. సోమవారం ఢిల్లీలోని రాజాజిమార్గ్లో ఉన్న ఆయన నివాసానికి వెళ్లి పుష్పగుచ్చం ఇచ్చి శాలువాతో సత్కరించారు. ఆయురారోగ్యాలతో ఉన్నత పదవుల్లో కొనసాగాలని కోరుకున్నారు. కాకాతో ఖర్గేకు ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. అనంతరం ఆయన ఆశీస్సులు తీసుకున్నారు. దేశ, రాష్ట్ర రాజకీయాలు, పార్టీ వ్యవహారాలపై చర్చించారు. మంత్రి వివేక్, ఎంపీ వంశీకృష్ణ పనితీరును ఖర్గే అభినందించారు. ప్రజల్లో ఉంటూ పార్టీ బలోపేతానికి కృషి చేయాలని సూచించారు.
దీర్ఘాయుష్షుతో జీవించండి: ప్రధాని మోదీ
ఖర్గేకు ప్రధాని మోదీ పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. దీర్ఘాయుష్షుతో, ఆరోగ్యంగా ఉండాలని ఆకాంక్షిస్తూ ‘ఎక్స్’లో విషెస్ చెప్పారు. పార్లమెంట్‌లోని కాంగ్రెస్ పార్టీ ఆఫీస్‌లో ఖర్గే జన్మదిన వేడుకలను లీడర్లు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలో రాహుల్, ప్రియాంక, పార్టీ ఎంపీలు పాల్గొన్నారు. ఖర్గే బర్త్ డే సందర్భంగా ప్రియాంకా గాంధీ.. స్పెషల్‌గా ఖర్జూరా కేక్ తయారు చేయించారు. పలువురు ఎంపీలు తీసుకొచ్చిన కేక్‌లను ఖర్గే కట్ చేయించారు. మరోవైపు, మల్లికార్జున ఖర్గేకు సీఎం రేవంత్‌రెడ్డి, పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్, పలువురు రాష్ట్ర కాంగ్రెస్ నేతలు పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పారు. ఖర్గే మంచి విజనరి లీడర్ అని, దేశ ప్రజలకు మరింత సేవ చేసేందుకు ఆయన ఆయురారోగ్యాలతో ఉండాలని ఈ సందర్భంగా సీఎం రేవంత్ కోరారు.