కాంగ్రెస్‎ను గెలిపించండి.. నవీన్, అజారుద్దీన్‎తో పాటు నేను అండగా ఉంటా: మంత్రి వివేక్

కాంగ్రెస్‎ను గెలిపించండి.. నవీన్, అజారుద్దీన్‎తో పాటు నేను అండగా ఉంటా: మంత్రి వివేక్

హైదరాబాద్: 2024 పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓట్లు అన్నీ బీజేపీకి పడ్డాయని.. అందుకు ప్రతిఫలంగా ఇప్పుడు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో బీజేపీ ఓట్లు బీఆర్ఎస్‎కు మళ్లీస్తున్నారని మంత్రి వివేక్ వెంకటస్వామి అన్నారు. జూబ్లీహిల్స్ తమ పోటీ సీరియస్ కాదని బీజేపీ నేతలే చెప్తున్నారన్నారు. సోమవారం (నవంబర్ 3) టోలిచౌకిలోని జానకినగర్‎లో మైనార్టీ నేతల సమావేశం జరిగింది. 

ఈ సమావేశానికి మంత్రులు వివేక్ వెంకటస్వామి, అజారుద్దీన్, ఎమ్మెల్యే కౌసర్ మొయినొద్దీన్, ఫుడ్ కార్పొరేషన్ చైర్మన్ ఫయీమ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి వివేక్ మాట్లాడుతూ.. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో భాగంగా తాను షేక్ పేట్ డివిజన్ ఇంచార్జ్ బాధ్యతలు చేపట్టాక.. డివిజన్‎లో ఎక్కడ ఏ సమస్యలు ఉన్నాయో తెలుసుకున్నానని అన్నారు. 

చాలా పనులు చేయించా ఇంకా చేయాల్సినవి పనులు ఉన్నాయని.. అవి తొందరలోనే చేయిస్తామని హామీ ఇచ్చారు. జూబ్లీహిల్స్ బైపోల్‎లో కాంగ్రెస్‎ను గెలిపిస్తే నవీన్ యాదవ్, అజారుద్దీన్ తో పాటు నేను కూడా మీకు అండగా ఉంటానని.. అభివృద్ధి పనులు ఇంకా చేయించుకోవచ్చన్నారు. నవీన్ యాదవ్ మంచి నాయకుడని... మీరంతా కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి గెలిపించాలని కోరారు