ముస్లిం మహిళలకు కుట్టుమిషన్లు పంపిణీ: మంత్రి వివేక్ వెంకటస్వామి

ముస్లిం మహిళలకు కుట్టుమిషన్లు పంపిణీ: మంత్రి వివేక్ వెంకటస్వామి

పదేండ్లు రాష్ట్రాన్ని పాలించిన బీఆర్ఎస్ ప్రభుత్వం ఏనాడైనా ముస్లిం మైనార్టీలను పట్టించుకోలేదని మంత్రి వివేక్ వెంకటస్వామి అన్నారు. చెన్నూరులో పర్యటించిన మంత్రి .. ముస్లిం మైనార్టీ మహిళలకు కుట్టుమిషన్లు పంపిణీ  చేశారు. కుట్టుమిషన్లు ఆర్థికంగా చేయూతకు తోడ్పాడునందిస్తాయన్నారు. మైనార్టీల అభివృద్ధికోసం తమ ప్రభుత్వం పనిచేస్తుందన్నారు మంత్రి వివేక్ వెంకటస్వామి.  2026  రాష్ట్ర బడ్జెట్ లో ఇందిరమ్మ ఇళ్లకు రూ. 5వేల కోట్లు కేటాయించామన్నారు మంత్రి.  సొంత జాగా ఉండి అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇండ్లు కట్టిస్తామన్నారు.   

అంతకుముందు మంచిర్యాల జిల్లా మందమర్రిలో ముస్లిం సోదరులతో కలిసి ప్రార్థనల్లో పాల్గొన్నారు. వారికి రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. మైనార్టీల అభ్యున్నతికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన..ఈద్గా, దర్గాలలో మౌళిక సదుపాయాల కల్పన కు కృషి చేస్తామన్నారు. 

మందమర్రిలో రు.50లక్షలతో షాదిఖానా,ఈద్గా వద్ద కాంపౌండ్ వాల్ ఏర్పాటు చేసేందుకు పనులను త్వరలోనే ప్రారంభిస్తామన్నారు. సింగరేణి సంస్థతో మాట్లాడి మందమర్రి ఈద్గా వద్ద కమాన్ ఏర్పాటు చేస్తామన్నారు. కాంగ్రెస్ సెక్యూలర్ పార్టీ అని, ముస్లీంలకు అన్ని విధాలా అండగా ఉంటుందన్నారు. మందమర్రి, రామకృష్ణాపూర్ పట్టణాల్లోని పలు ముస్లింల ఇండ్లలో షేమియాను మంత్రి సేవించారు. మంత్రి వెంట డీసీసీ అధ్యక్షుడు రఘునాథ్ రెడ్డి, మైనార్టీ నేతలు అబ్దుల్ అజీజ్, యాకుబ్ అలీ ఉన్నారు.