ముంబై: మహారాష్ట్ర గవర్నర్గా వెళుతున్న జిష్ణుదేవ్ వర్మను మంత్రి వివేక్ వెంకటస్వామి, ఆయన సతీమణి సరోజ, వారి కుమారుడు ఎంపీ వంశీకృష్ణ మర్యాదపూర్వకంగా కలిశారు. తెలంగాణ గవర్నర్ గా ఆయన చేసిన సేవలను మంత్రి వివేక్ వెంకట స్వామి ఈ సందర్భంగా గుర్తుచేశారు. ఇదిలా ఉండగా.. శనివారం సోమాజిగూడలోని ఓ హోటల్లో సీఐఐ వార్షిక సమావేశం జరిగింది.
ఈ మీటింగ్ కు చీఫ్ గెస్ట్ గా గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, కార్మిక మైనింగ్ శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి అటెండ్ అయ్యారు. సస్టైనబుల్ తెలంగాణ అనే అంశంపై ఈ సదస్సు జరిగింది. సస్టైనబిలిటీ, పోటీతత్వ తెలంగాణ నిర్మాణంపై కీలక చర్చలు జరిగాయి. తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా వివిధ రాష్ట్రాల నుంచి పారిశ్రామికవేత్తలు ఈ సదస్సుకు హాజరయ్యారు.
ఈ సదస్సులో జిష్ణు దేవ్ వర్మ మాట్లాడుతూ.. వివేక్ వెంకటస్వామి మినిస్టర్ కాకముందు నుంచే తనకు తెలుసని, యూత్లో స్కిల్స్ నేర్పించేందుకు ముందడుగేస్తున్న ఆయన్ని అభినందిస్తున్నానని చెప్పారు. మనతో పాటు మన తోటి ఇండస్ట్రీలను ఎదగనియ్యాలని, అందరం అభివృద్ధి చెందితేనే దేశం అభివృద్ధి చెందుతుందని తెలిపారు.
మన ప్రధాని నరేంద్ర మోదీ కూడా ఇదే కోరుకుంటున్నారని అని గవర్నర్ పేర్కొన్నారు. హైదరాబాద్లో తనకు ఇదే లాస్ట్ స్పీచ్ అని.. తాను మహారాష్ట్రకు వెళ్లిపోతున్నానని గవర్నర్ తెలిపారు. విద్యార్థులకు హోమ్ సిక్ ఉన్నట్టు.. తనకు హైదరాబాద్ సిక్ ఉంటుందేమో అని అన్నారు.
