పేదలకు అండగా కాంగ్రెస్ సర్కార్..ఇచ్చిన మాట ప్రకారమే ఇందిరమ్మ ఇండ్లు: మంత్రి వివేక్ వెంకటస్వామి

పేదలకు అండగా కాంగ్రెస్ సర్కార్..ఇచ్చిన మాట ప్రకారమే ఇందిరమ్మ ఇండ్లు: మంత్రి వివేక్ వెంకటస్వామి

ఇచ్చిన మాట ప్రకారం పేదలకు ఇందిరమ్మ ఇండ్లు ఇస్తున్నామని చెప్పారు మంత్రి వివేక్ వెంకటస్వామి. సిరిసిల్లలో   సకలజనుల సన్మాన కార్యక్రమంలో మాట్లాడిన ఆయన..  కేసీఆర్ హయాంలోనే కాళేశ్వర కట్టారు..వాళ్ల హయాంలోనే కూలిందన్నారు.  కాళేశ్వరంపై బీఆర్ఎస్ పచ్చి అబద్దాలు చెబుతోందని విమర్శించారు.  ఇరిగేషన్ పై కేటీఆర్ కు కనీస అవగాహన లేదన్నారు.  కాంగ్రెస్ కట్టిన ఎల్లంపల్లి నుంచే  గోదావరి నీళ్లు హైదరాబాద్ కు  తరలిస్తామని చెప్పారు. కేసీఆర్ ఫ్యామిలీపై కవిత ఆరోపణలకు  సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు వివేక్.  

అమరుల త్యాగాలతోనే తెలంగాణ వచ్చిందన్నారు మంత్రి వివేక్.  యువకుల బలిదానాలు చూసి చలించిపోయిన సోనియా తెలంగాణ ఇచ్చిందన్నారు.  ఉద్యమంలో అమరులైన కుటుంబాలకు లక్ష ఇచ్చామని చెప్పారు.  గత ప్రభుత్వ హయాంలో సిరిసిల్లలో ఇసుక మాఫియా రాజ్యమేలిందన్నారు.  ఇచ్చిన మాట ప్రకారం పేదలకు   పేదలకు ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డులు పంపిణీ చేస్తున్నామని తెలిపారు.  స్కిల్ డెవ్ లప్ మెంట్ తో   యువతతలో నైపుణ్యం కల్పిస్తున్నామని చెప్పారు.పేద మహిళలకు ఆర్థిక భరోసా కల్పిస్తున్నామని..కల్వకుంట్ల కుటుంబం ఖజానా ఖాళీ చేసినా..సీఎం రేవంత్ రెడ్డి స్కీమ్స్ కొనసాగిస్తున్నారని చెప్పారు. 

 ఇచ్చిన హామీ ప్రకారం 2లక్షల ఉద్యోగాల భర్తీ కొనసాగుతుందన్నారు.సిరిసిల్లలో జౌళి శాఖ కార్మికులను న్యాయం చేయాలని కోరుతున్నారు... తప్పకుండా వారికి అండగా ఉంటామని తెలిపారు. ఆనాడు  తెలంగాణ రాష్టం కోసం పార్లమెంట్ లో కాక స్ఫూర్తితోనే కోట్లాడామని తెలిపారు. సిరిసిల్లలో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేయాలన్నారు.