
హైదరాబాద్ లోని షేక్ పేట్ డివిజన్ ను అన్ని విధాల అభివృద్ధి చేస్తున్నామని అన్నారు మంత్రి వివేక్ వెంకటస్వామి. ఆగస్టు 4న ఉదయం కోటి యాభై లక్షలతో సీసీ రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేశారు మంత్రులు వివేక్ వెంకటస్వామి, తుమ్మల నాగేశ్వర రావు, మేయర్ గద్వాల విజయలక్ష్మి,స్థానిక కార్పొరేటర్..
ఈ సందర్బంగా మాట్లాడిన వివేక్ వెంకటస్వామి. షేక్ పేటలో ఎటువంటి సమస్యలున్నా తక్షణమే తిరుస్తామని హామీ ఇచ్చారు వివేక్ వెంకటస్వామి. ఎక్కువ శాతం ఆదాయం హైద్రాబాద్ నుంచే వస్తుందని చెప్పారు. జూబ్లీహిల్స్ అభివృద్ధి కోసం తాము తప్పకుండా పని చేస్తామని అన్నారు. ఏదైనా సమస్య ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని సూచించారు.
క్షేత్రస్థాయిలో పర్యటనలు
గత 15 రోజులుగా నియోజకవర్గంలోని బూత్ స్థాయి నేతలతో మంత్రి వివేక్ వెంకటస్వామి వరుసగా సమావేశం అవుతూ.. కార్యకర్తల్లో జోష్ తీసుకువస్తున్నారు. క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ స్వయంగా ప్రజల సమస్యలను తెలుసుకుంటున్నారు. అధికారులతో మాట్లాడుతూ పలు సమస్యలను అప్పటికప్పుడే పరిష్కరిస్తున్నారు. బోరబండ, షేక్ పేట, యూసఫ్ గూడలాంటి ప్రాంతాల్లో తిరుగుతూ.. రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ ను గెలిపించాలని కోరుతున్నారు.
►ALSO READ | అనిల్ అంబానీకి బిగుస్తున్న ఉచ్చు.. రిలయన్స్ రుణాలపై బ్యాంకులకు ఈడీ లేఖలు!