నా తండ్రి స్ఫూర్తితోనే గిగ్ వర్కర్స్ కు చట్టం: మంత్రి వివేక్

నా తండ్రి స్ఫూర్తితోనే గిగ్ వర్కర్స్ కు చట్టం: మంత్రి వివేక్

ప్రేవేట్ సెక్టార్ లో ఉద్యోగుల భద్రత కోసం పెన్షన్ స్కీమ్ ను తన తండ్రి వెంకటస్వామి తీసుకొచ్చారని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి అన్నారు. హైదరాబాద్ నాంపల్లి లోని తెలంగాణ గెజిటెడ్ ఆఫీసర్ భవన్ లో తెలంగాణ ప్రేవేట్ ఉద్యోగుల సంఘం డైరీ ఆవిష్కరణ కార్యక్రమానికి తెలంగాణ జన సమితి అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాంతో కలిసి మంత్రి పాల్గొని డైరీని ఆవిష్కరించారు.

 ఈ సందర్భంగా మాట్లాడిన   మంత్రి వివేక్ వెంకటస్వామి... తన తండ్రి స్ఫూర్తితోనే గిగ్ వర్కర్స్ కోసం చట్టం తీసుకొచ్చామన్నారు. రానున్న అసెంబ్లీ సమావేశాల్లో చట్టాన్ని అమలు చేసి , గిగ్ వర్కర్స్ భద్రత కోసం బోర్డును ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.  గత బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో కనీస వేతనాలను పెంచలేదని , కాంగ్రెస్ ప్రభుత్వం కనీస వేతనాలను పెంచనున్నట్లు తెలిపారు. 

►ALSO READ | సీఎం రేవంత్ చేతుల మీదుగా.. మార్చి8న బమృక్‌నుద్దౌలా చెరువు ప్రారంభం

తెలంగాణ ఉద్యమంలో ప్రేవేట్ ఉద్యోగుల పాత్ర కీలకమైనదని , ఉద్యమకారులకు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేస్తుందన్నారు. ప్రేవేట్ ఉద్యోగుల సమస్యలను ముఖ్యమంత్రితో చర్చించి , పరిష్కారానికి కృషి చేస్తానని వివేక్ వెంకటస్వామి హామీ ఇచ్చారు. మంత్రి వివేక్ వెంకటస్వామి చొరవతోనే గిగ్ వర్కర్స్ చట్టం వచ్చిందని ప్రో.కోదండరాం అన్నారు. కార్మికుల సంక్షేమం కోసం ఆయన నిరంతరం కృషి చేస్తారని కొనియాడారు. అలాగే బ్లూ కాలర్ వర్కర్స్ సంక్షేమం కోసం ప్రభుత్వం చొరవ చూపాలని కోదండరాం విజ్ఞప్తి చేశారు.