యువతకు ఉపాధి కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం: మంత్రి వివేక్ వెంకటస్వామి

యువతకు ఉపాధి కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం: మంత్రి వివేక్ వెంకటస్వామి

రాష్ట్రంలో పరిశ్రమల అభివృద్ధికి  ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు మంత్రి వివేక్ వెంకటస్వామి. మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా శామీర్ పేట్ జీనోమ్ వ్యాలీలో  ఐకోర్ బయాలాజిక్స్ కొత్త యూనిట్ కు భూమి పూజ చేశారు సీఎం రేవంత్ రెడ్డి. ఈ కార్యక్రమంలో మంత్రి వివేక్ వెంకటస్వామి,శ్రీధర్ బాబు పలువురు అధికారులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మాట్లాడిన మంత్రి వివేక్.. ఉద్యోగాల కల్పన కోసం ప్రభుత్వం ప్రయత్నిస్తోందన్నారు.  అధిక ఉద్యోగాల కల్పన కోసం సీఎం రేవంత్ రెడ్డి  ప్రయత్నిస్తున్నారని చెప్పారు. స్కిల్ యూనివర్శిటీ పెట్టిందే యువత కోసమన్నారు.  ఎక్కువ పరిశ్రమలు స్థాపించి..ఎక్కువ ఉద్యోగాలు కల్పించడమే లక్ష్యమని చెప్పారు.  యువతకు ఉపాధి కోసమమే పెట్టుబడుల ప్రయత్నమని చెప్పారు. అన్ని రంగాల్లో పరిశ్రమల స్థాపనకు ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు మంత్రి వివేక్.