షేక్ పేట్ ఎంజీ కాలనీలో దుర్గామాతను దర్శించుకున్న మంత్రి వివేక్ వెంకటస్వామి..

షేక్ పేట్ ఎంజీ కాలనీలో దుర్గామాతను దర్శించుకున్న మంత్రి వివేక్ వెంకటస్వామి..

సోమవారం ( సెప్టెంబర్ 22 ) షేక్ పేట్ ఎంజీ కాలనీలో పర్యటించారు మంత్రి వివేక్ వెంకటస్వామి. కాలనీలోని దుర్గామాతను దర్శించుకున్న అనంతరం బాల్కాపూర్ నాలాను సందర్శించారు. ఈ క్రమంలో ఎంజీ కాలనీవాసులు తమ సమస్యలను మంత్రికి వివరించారు.కాలనీలోని సమస్యలు తన దృష్టికి వచ్చాయని... వీలైనంత త్వరగా సమస్యలు పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు మంత్రి వివేక్. 

ఇదిలా ఉండగా.. షేక్ పేట్ డివిజన్ లోని తేజా కాలనీలో బూత్ స్థాయి కార్యకర్తల సమావేశానికి ముఖ్య అతిధిగా హాజరయ్యారు మంత్రి వివేక్ వెంకటస్వామి. ఈ సందర్భంగా కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు మంత్రి వివేక్. అధికారులతో కలిసి స్థానిక సమస్యలపై పూర్తి వివరాలు తెలుసుకున్నానని అన్నారు మంత్రి వివేక్.

షేక్ పేట్ డివిజన్లో చాల స్లమ్స్ ఉన్నాయని.. ఒక్కో డివిజన్ కు రూ. 20 కోట్లు కేటాయించామని అన్నారు. రోడ్డు, డ్రైనేజీ సమస్యలను పరిష్కరిస్తామని.. రూ. 40 లక్షలతో తేజా కాలనీలో సీసీ రోడ్డు పనులు వారం రోజుల్లో మొదలు [పెడతామని అన్నారు మంత్రి వివేక్ వెంకటస్వామి.