బీఆర్ఎస్ ఐటీఐలను నాశనం చేసింది.. ఏటీసీల ద్వారా 2 లక్షలు ఉద్యోగాలు: మంత్రి వివేక్

బీఆర్ఎస్ ఐటీఐలను నాశనం చేసింది.. ఏటీసీల ద్వారా 2 లక్షలు ఉద్యోగాలు: మంత్రి వివేక్

హైదరాబాద్: యువతకు ఉపాధి అవకాశాలకు కల్పించే ఐటీఐ సంస్థలను గత బీఆర్ఎస్ ప్రభుత్వం నాశనం చేసిందని మంత్రి వివేక్ వెంకటస్వామి విమర్శించారు. శనివారం (సెప్టెంబర్ 27) హైదరాబాద్ మల్లేపల్లిలో అడ్వాన్స్డ్ ట్రైనింగ్ సెంటర్ (ఏటీసీ)ల ప్రారంభోత్సవ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి మంత్రులు పొన్నం ప్రభాకర్, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, శ్రీధర్ బాబు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం, టాటా గ్రూప్ సంయుక్తంగా ఏర్పాటు చేసిన 64 ఏటీసీలను సీఎం రేవంత్ రెడ్డి వర్చువల్‎గా ప్రారంభించారు. 

ఈ కార్యక్రమానికి మంత్రి వివేక్ వెంకటస్వామి వర్చువల్‎గా హాజరై మాట్లాడారు. బీఆర్ఎస్ రాష్ట్రంలోని ఐటీఐ సంస్థలను నాశనం చేసిందన్నారు. మేం అధికారంలోకి వచ్చాక యువతకు 60 వేల ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చామని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన ఏటీసీల ద్వారా యువతకు  2 లక్షల ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ సింగరేణి సంస్థను కూడా పట్టించుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. మేం అధికారంలోకి వచ్చాక సింగరేణి గనిలో కొత్త ఉద్యోగాలు కల్పించామన్నారు.