తిరుపతిలో వివాహ వేడుకకు హాజరైన.. మంత్రి వివేక్, సరోజ దంపతులు

తిరుపతిలో వివాహ వేడుకకు హాజరైన.. మంత్రి వివేక్, సరోజ దంపతులు

తిరుపతిలో ఓ వివాహ వేడుకకు హాజరయ్యారు మంత్రి వివేక్ వెంకటస్వామి, సరోజ దంపతులు. బుధవారం (మే 6) తిరుపతిలోని పద్మావతి కళ్యాణ మండపంలో జరిగిన గోదావరిఖనికి చెందిన మల్లికార్జున, శశికళ దంపతుల కుమారుడు పణి యశ్వంత్, గాయత్రి శ్రీప్రియల వివాహ వేడుకలో పాల్గొని నూతన వధువరులను ఆశీర్వదించారు మంత్రి. అంతకుముందు సతీసమేతంగా మంత్రి వివేక్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. 

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అనంతరం మంత్రి వివేక్ వెంకటస్వామి మాట్లాడారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అనాలోచిత నిర్ణయాల కారణంగా ప్రపంచదేశాలు ఇబ్బందులకు గురవుతున్నాయని మంత్రి వివేక్ వెంకటస్వామి అన్నారు. పెట్రోల్, డీజిల్ ధరలు పెరగడం, రూపీ వాల్యూ తగ్గడం ప్రజలపై భారం పడేలా చేసిందన్నారు. అమెరికా డాలర్‎తో రూపీ విలువ పడకుండా చూస్తామని ప్రధాని మోడీ చెప్పారని.. కానీ రూపాయి విలువ దారుణంగా పతనమైందని అన్నారు.