V6 News

కార్మికుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది: మంత్రి వివేక్ వెంకటస్వామి వెల్లడి

కార్మికుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది: మంత్రి వివేక్ వెంకటస్వామి వెల్లడి

హైదరాబాద్, వెలుగు: అంతర్జాతీయ కార్మిక దినోత్సవం (మే డే) సందర్భంగా కార్మికులకు  రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి డాక్టర్ వివేక్ వెంకటస్వామి శుభాకాంక్షలు తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడూ కార్మికుల హక్కుల పక్షాన నిలుస్తుందని.. సంఘటిత, అసంఘటిత రంగాల్లోని ఏ ఒక్క వర్గాన్ని ప్రభుత్వం నిర్లక్ష్యం చేయదని గురువారం ఓ ప్రకటనలో స్పష్టం చేశారు. 

అసంఘటిత రంగ కార్మికుల హక్కుల రక్షణ కోసం ప్రభుత్వం తీసుకువచ్చిన 'తెలంగాణ గిగ్ ప్లాట్‌‌ఫామ్ ఆధారిత కార్మికుల సంక్షేమ చట్టం' ద్వారా రాష్ట్రవ్యాప్తంగా 4 లక్షలకు పైగా కార్మికులకు లబ్ధి చేకూరనుందని వివరించారు. అలాగే, ఆర్టీసీ కార్మికుల దీర్ఘకాలిక డిమాండ్లను పరిష్కరిస్తూ.. ఇటీవల 11 శాతం వేతన వృద్ధిని ప్రకటించడం ద్వారా ప్రభుత్వం తన నిబద్ధతను చాటుకుందని గుర్తుచేశారు.