V6 News

మంత్రులు నా ఫోన్లు  ఎత్తట్లే ! : పోచారం శ్రీనివాస్‌‌‌‌రెడ్డి

మంత్రులు నా ఫోన్లు  ఎత్తట్లే ! : పోచారం శ్రీనివాస్‌‌‌‌రెడ్డి
  • సిద్ధాపూర్ రిజర్వాయర్‌‌‌‌ కోసం సీఎంకు 20 సార్లు చెప్పినా ఫండ్స్​ వస్తలే 
  • ఎవరితో మాట్లాడాలో అర్థమైతలే..
  • ప్రభుత్వ సలహాదారుడు పోచారం శ్రీనివాస్‌‌‌‌రెడ్డి

నిజామాబాద్, వెలుగు :  మంత్రులు తన ఫోన్లను ఎత్తడం లేదని, తాను ప్రాతినిధ్యం వహిస్తున్న బాన్సువాడ సెగ్మెంట్‌‌‌‌లో సిద్ధాపూర్‌‌‌‌ రిజర్వాయర్‌‌‌‌ కోసం ఫండ్స్‌‌‌‌ కావాలని సీఎం రేవంత్‌‌‌‌రెడ్డిని 20 సార్లు కోరినా పనికాలేదని ప్రభుత్వ సలహాదారుడు పోచారం శ్రీనివాస్‌‌‌‌రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ‘20 ఏండ్ల క్రితమే మంత్రిగా పనిచేసినోడ్ని. అర్ధరాత్రి ఒంటి గంటకు ఫోన్‌‌‌‌  చేసినా సీఎంలు ఎత్తి మాట్లాడేవారు.

ఇప్పుడట్లలేదు.  నేను ఫోన్‌‌‌‌ చేస్తే ఎత్తట్లేదు. ఇలాంటి పరిస్థితిలో ఎవరితో మాట్లాడాలో అర్థమైతలేదు’ అన్నారు. వర్ని మండలం సిద్ధాపూర్ గ్రామంలో 10 వేల ఎకరాలకు సాగు నీరందించే లక్ష్యంతో బీఆర్ఎస్‌‌‌‌ హయాంలో రూ.260 కోట్ల అంచనా వ్యయంతో నాలుగేండ్ల క్రితం సిద్ధాపూర్‌‌‌‌ రిజర్వాయర్‌‌‌‌ పనులు మొదలయ్యాయి. ఈ పనుల పరిశీలనకు ఆదివారం సాయంత్రం 6 గంటలకు వెళ్లిన పోచారం శ్రీనివాస్‌‌‌‌రెడ్డి రాత్రి 11 వరకు అక్కడే ఉన్నారు.

 ఫండ్స్​లేకుండా పనులు కొనసాగించలేనని కాంట్రాక్టర్​చెప్పడంతో ఇరిగేషన్​సీఈ శ్రీనివాస్‌‌‌‌రావుతో ఫోన్‌‌‌‌లో మాట్లాడుతూ ప్రభుత్వంపై విమర్శలు చేశారు. ఆ సంభాషణ కాస్తా సోమవారం వైరల్​కావడం రాజకీయాల్లో పెనుదుమారం రేపింది. ‘ఇంట్లో కూడా చెప్పక ఏదో ఒకటి తేల్చుకోడానికి వచ్చిన. రాత్రి ఇక్కడే నిద్రిస్త. నేను నిన్నమొన్నటి వాడ్ని కాదు.

సీనియర్​ ఎమ్యెల్యేను. ఆగిన పనులు కొనసాగించడానికి ఫండ్స్​ఇవ్వమని సీఎంను 20 సార్లు కోరిన. నా ఫోన్‌‌‌‌ ఎత్తకపోవడం కొత్తగా చూస్తున్న. మంత్రులు.. ఎమ్మెల్యేల ఫోన్లు లేపరండీ.. పనిలేక ఫోన్‌‌‌‌ చేస్తమా? తమాషాకు చేస్తమా? నేను అందరిలాంటోడ్ని కూడా కాదు. నా స్వార్థం కోసం ఆ పైరవీ ఈ పైరవీ అని అడగను. ప్రజల కోసం ఫోన్‌‌‌‌ చేస్తే రెస్పాండ్‌‌‌‌ కావట్లేదు.

మాలాంటోళ్లకే ఈ పరిస్థితి ఉంటే ఎట్ల జేయాలె’ అని పోచారం సీఈతో అన్నారు. ‘మొండితనంతో ఇక్కడికి వచ్చిన. జంగిల్లో ఉన్న. ఇక్కడే నిద్రిస్త. చస్తే చస్త. బతికితే బతుకుత. పానం ఏదో ఓ రోజు పోయేదే. ఎవరికి చెప్పుకోవాలే మా బాధ’  అంటూ వ్యాఖ్యానించగా తానేమీ చేయలేనని సీఈ శ్రీనివాస్‌‌‌‌రావు చెప్పడంతో ఫోన్‌‌‌‌ పెట్టేశారు. 

కాళ్లు మొక్కాల్నా..?

సీఈ శ్రీనివాస్‌‌‌‌రావుతో ఫోన్‌‌‌‌ సంభాషణ ముగిశాక తనతో వచ్చిన రైతుల్లో కొందరు మంత్రులను కలవాలని పోచారం శ్రీనివాస్‌‌‌‌రెడ్డికి సూచించారు. దీంతో మంత్రుల దగ్గరకు పోయి వారి కాళ్లు మొక్కాల్నా ? అని ప్రశ్నించారు. రిజర్వాయిర్‌‌‌‌ పనులు ఎవరూ పట్టించుకుంటలేరు. ఇలాగే ఉంటే అంతటా పిచ్చి చెట్లు మొలుస్తయ్‌‌‌‌ అన్నారు. పోలీసులు వచ్చి సముదాయించడంతో రాత్రి 11 గంటలకు అక్కడి నుంచి వెళ్లిపోయారు. 

పోచారం శ్రీనివాస్‌‌‌‌కు అన్నీ తెల్సు : టీపీసీసీ చీఫ్​మహేశ్‌‌‌‌గౌడ్‌‌‌‌

‘ప్రభుత్వ సలహాదారుడిగా వ్యవహరిస్తున్న పోచారంశ్రీనివాస్‌‌‌‌రెడ్డి రాజకీయాల్లో సీనియర్‌‌‌‌ నాయకుడు. ఆయనకు అన్నీ తెలుసు’ అని టీపీసీసీ చీఫ్​మహేశ్‌‌‌‌గౌడ్‌‌‌‌ నిజామాబాద్‌‌‌‌లో మీడియాతో అన్నారు. 45 ఏండ్ల కాంగ్రెస్, తెలుగుదేశం పాలనలో రాష్ట్ర​ అప్పులు 68 వేల కోట్లు మాత్రమేనని, పదేండ్ల బీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌ పాలనలో రూ.8 లక్షల కోట్ల అప్పులు నెత్తినేశారని చెప్పారు. ‘ప్రతి నెలా వడ్డీ, కిస్తు కలిపి రూ.7 వేల కోట్లు కడుతున్నం. ఇవన్నీ పోచారానికి తెలియనివి కాదు. కొన్ని ఇబ్బందులున్నయ్​కాదనను. అభివృద్ధిని కాంక్షించే లీడర్‌‌‌‌గా ఫండ్స్​అడుగుతున్న పోచారం అర్థం చేసుకుంటారని భావిస్తున్న’ అన్నారు.