సమతా మూర్తి స్ఫూర్తి కేంద్రం సామరస్యతకు చిరునామా

సమతా మూర్తి స్ఫూర్తి కేంద్రం సామరస్యతకు చిరునామా
  • ముచ్చింతల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను సందర్శించిన గవర్నర్ శివప్రతాప్ శుక్లా దంపతులు

హైదరాబాద్, వెలుగు: ముచ్చింతల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోని సమతా మూర్తి స్ఫూర్తి కేంద్రం ఆధ్యాత్మికత, సామరస్యత, సమానత్వ విలువలకు చిరస్థాయిగా నిలిచే దివ్యక్షేత్రమని గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా అన్నారు. గురువారం తన సతీమణి జానకి శుక్లాతో కలిసి గవర్నర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ తొలిసారిగా సమతా మూర్తి స్ఫూర్తి కేంద్రాన్ని సందర్శించారు. 216 అడుగుల ఎత్తైన రామానుజాచార్యుల పంచలోహ విగ్రహాన్ని దర్శించుకున్నారు. సమతా మూర్తి కేంద్రంలోని 108 దివ్యదేశాల విశిష్టతను తెలుసుకున్నారు. హారతి కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం వైకుంఠనాథ భగవానుడిని దర్శించుకొని ప్రత్యేక ప్రార్థనలు చేశారు. 

తర్వాత చిన జీయర్ స్వామిని గవర్నర్ దంపతులు కలిశారు. ఈ సందర్భంగా రామానుజాచార్యుల విశిష్ట సేవలు, విశిష్టాద్వైత తత్వం, సమతా మూర్తి స్ఫూర్తి కేంద్ర నిర్మాణ లక్ష్యం, ఇక్కడ నిర్వహిస్తున్న సేవా కార్యక్రమాల గురించి జీయర్ స్వామి గవర్నర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు వివరించారు. ఈ సందర్భంగా గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా మాట్లాడుతూ, సమతా మూర్తి విగ్రహం సామరస్యతకు, సామాజిక సమానత్వానికి ప్రతీక అని పేర్కొన్నారు. ఈ పుణ్యక్షేత్రం తనకు అపూర్వమైన ఆధ్యాత్మిక అనుభూతిని కలిగించిందన్నారు. వెయ్యేళ్ల క్రితమే జాతి, భాష, వర్ణ భేదాలకు అతీతంగా సమానత్వ సందేశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లిన మహనీయుడు రామానుజాచార్యులు అని పేర్కొన్నారు.