
హైదరాబాద్ లో జరుగుతున్న ఫార్ములా–ఈ కారు రేసింగ్ లో వరుసగా స్వల్ప ప్రమాదాలు జరుగుతున్నాయి. క్వాలిఫైయింగ్ రేసులో చెన్నై మహిళా రేసర్ కు గాయాలయ్యాయి. తర్వాత ఫార్ములా–4 రేసింగ్ లో యాక్సిడెంట్ జరిగింది. మూల మలుపుల దగ్గర స్పీడ్ కంట్రోల్ తప్పడంతో ప్రమాదం జరిగినట్లు నిర్వాహకులు చెబుతున్నారు. టర్నింగ్ దగ్గర 3 కార్లు ఒకదాన్నొకటి ఢీ కొన్నాయి. దీంతో రేసింగ్ కు కాసేపు అంతరాయం ఏర్పడింది. కొంత గ్యాప్ తర్వాత ఫార్ములా–4 రేసు పోటీలు మళ్లీ మొదలయ్యాయి. అయితే కారు రేసింగ్ లో స్వల్ప ప్రమాదాలు కామన్ అని నిర్వాహకులు తెలిపారు.
ఇవాళ ఉదయం నుంచే పోటీలు మొదలయ్యాయి. మధ్యాహ్నం ఒంటిగంటకు పోల్ పొజిషన్ రేస్ మొదలు కాగా.. మధ్యాహ్నం 2 గంటలకు 25 నిమిషాల పాటు స్ప్రింట్ 2 రేస్ షురూ అయింది. మధ్యాహ్నం మూడున్నరకు స్ప్రింట్ 3 రేస్ 45 నిమిషాల పాటు జరగింది. ఆదివారం కావటంతో రేసింగ్ చూసేందుకు నగరవాసులు భారీగా తరలివచ్చారు.