V6 News

మైనార్టీల సంక్షేమానికి పెద్దపీట: వినోద్ కుమార్

మైనార్టీల సంక్షేమానికి పెద్దపీట: వినోద్ కుమార్

హైదరాబాద్, వెలుగు: మైనార్టీల సంక్షేమానికి సీఎం కేసీఆర్ ​పెద్దపీట వేస్తున్నారని ప్లానింగ్​బోర్డు వైస్ ​చైర్మన్ ​వినోద్ ​కుమార్​అన్నారు. మైనార్టీల స్వయం ఉపాధి కోసం రూ.లక్ష ఆర్థిక సాయం జీవో విడుదల చేయడంతో  మైనార్టీల నేతలు మినిస్టర్స్​ క్వార్టర్స్​లో ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు. మైనార్టీల కోసం ఏటా వేల కోట్ల బడ్జెట్​ఖర్చు చేస్తున్నామని తెలిపారు. వినోద్​ను కలిసిన వారిలో నాయకులు ఫిరోజ్ ఖాన్, ఫైజల్ ఖాన్, ఫసి, అయాన్, అక్బర్, జాఫర్ పటేల్, సాజిద్ తదితరులు ఉన్నారు. ఈ సందర్భంగా వినోద్​కుమార్​బర్త్​డే కేక్​కట్​చేశారు.