
న్యూఢిల్లీ: కేంద్ర మైనారిటీ వ్యవహారాల మంత్రిత్వశాఖ సీనియర్ ఆఫీసర్ల బృందం కాశ్మీర్ లో పర్యటిస్తుందని మంత్రి ముక్తార్ అబ్బాస్ నక్వీ ఆదివారం చెప్పారు. మంగళ, బుధవారాల్లో పర్యటించనున్న ఈ బృందం అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టేందుకు ఉన్న అవకాశాలను గుర్తించనున్నట్లు తెలిపారు. త్వరలో జమ్మూ, లడఖ్ లోనూ ఈ బృందం పర్యటిస్తుందని చెప్పారు. రాజకీయ లబ్ధి కోసమే కొందరు ఆర్టికల్ 370 రద్దును వ్యతిరేకిస్తున్నారని మర్శించారు.”మంగళవారం, బుధవారం సెక్రటరీతోపాటు సీనియర్ అధికారుల బృందం కాశ్మీర్ లో పర్యటిస్తుంది.
స్కూళ్లు, కాలేజీలు, స్కిల్ డెవలప్ మెంట్ సెంటర్లు ఎక్కడెక్కడ తెరవాలని గుర్తిస్తుంది. సామాజిక, ఆర్థిక అభివృద్ధి ప్రాజెక్ టులను చేపట్టేం దుకు సాధ్యాసాధ్యాలను కూడా పరిశీలిస్తది” అని అన్నారు. కొందరు వేర్పాటు వాదులు ప్రజలను తప్పుదోవ పట్టించకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నట్లు చెప్పారు.”ఇది మోడీ సర్కారు. అన్ని అలోచించిన తర్వాతే నిర్ణయం తీసుకుంటుందని అందరికీ తెలుసు. ఒక్క సారి నిర్ణయం తీసుకున్న తర్వాత దానిపై పునరాలోచన అనేది ఉండదు” అని అన్నారు. ఆర్టికల్ 370 రద్దుతో అభివృద్ధి కార్యక్రమాలకు ఉన్న అడ్డంకులు తొలగిపోయాయన్నారు. లేహ్, లడఖ్, కార్గిల్, జమ్మూకాశ్మీర్ అన్ని ప్రాంతాల్లో స్కూళ్లు, కాలేజీలు,పాలి టెక్నిక్, ఇంజినీరింగ్ కాలేజీలు,ఆస్పత్రులు ఏర్పాటు చేస్తామని నక్వీ చెప్పారు.