Miss World 2025: హైదరాబాద్ కు చేరుకున్న మిస్ వరల్డ్ పోర్చుగల్ మరియా అమేలియా బాప్టిస్టా

Miss World 2025: హైదరాబాద్ కు చేరుకున్న మిస్ వరల్డ్ పోర్చుగల్ మరియా అమేలియా బాప్టిస్టా

హైదరాబాద్ లో 72వ మిస్ వరల్డ్ వేడుకలు జరగనున్న సంగతి తెలిసిందే.. హైదరాబాద్ లోని గచ్చిబౌలి స్టేడియంలో 31న జరగనున్న ఈ వేడుకలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ప్రభుత్వం ఘనంగా ఏర్పాట్లు చేస్తోంది. ఈ క్రమంలో ప్రపంచం నలుమూలల నుంచి ఈ పోటీల్లో పాల్గొనేందుకు అందగెత్తెలు హైదరాబాద్ కు చేరుకుంటున్నారు. తాజాగా మిస్ వరల్డ్ పోర్చుగల్ మరియా అమేలియా బాప్టిస్టా హైదరాబాద్ కు చేరుకున్నారు. 

సోమవారం ( మే 5 ) హైదరాబాద్ కు చేరుకున్న బాప్టిస్టా హైటెక్ సిటీలోని ట్రైడెంట్ లో సందడి చేశారు. ఇండియాకు రావడం ఇదే ఫస్ట్ టైం అని.. తెలంగాణాలో వివిధ పర్యాటక ప్రాంతాలను సందర్శిస్తానని అన్నారు బాప్టిస్టా.

Also Read : హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు అందాల తారలు

బ్రెస్ట్ క్యాన్సర్ అవేర్నెస్ కోసం కృషి చేస్తానని.. ఫండ్ రైజింగ్ చేసి పేద విద్యార్థులకు సాయం చేస్తానని అన్నారు బాప్టిస్టా. మొదటిసారి మిస్ వరల్డ్ పోటీలకు ఎంపికవ్వడం ఆనందాన్ని ఇచ్చిందని అన్నారు. ప్రపంచవ్యాప్తంగా విస్తరిస్తున్న బ్రెస్ట్ క్యాన్సర్, దానివల్ల జరిగే నష్టాలు, ప్రజల్లో అవేర్నెస్ కల్పించడం గురించి మిస్ వరల్డ్ స్టేజ్ పై మాట్లాడుతానన్నారు బాప్టిస్టా.